ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే దారుణంగా చంపిన భార్య!!

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోయాయి. పరాయి వ్యక్తులతో పడక సుఖం కోసం కొందరు జీవిత భాగస్వాముల ప్రాణాలు సైతం తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ కోవలోనే ఓ వివాహిత ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే దారుణంగా చంపేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో జరిగింది. నగరంలోని బోస్‌నగర్‌లో బెనర్జీ, శాంతి దంపతులు తమ కుమారుడితో కలిసి నివాసముంటున్నారు. బెనర్జీ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో బెనర్జీ యజమానికి, శాంతికి పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది

బెనర్జీ ఆఫీసుకి వెళ్లిన సమయంలో వీరిద్దరూ కలిసి హోటల్‌కి వెళ్లి ఎంజాయ్ చేసేవారు. అయితే భర్త కారణంగా ప్రియుడితో ఎక్కువగా గడపలేకపోతున్నానని అనుకున్న శాంతి అతడిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడికి కూడా చెప్పడంతో అతడు ఓకే అన్నాడు. దీంతో భర్త రాత్రివేళ తినే ఆహారంలో మత్తుమందు కలిపింది. అది తిని బెనర్జీ మత్తులోకి జారుకోవడంతో ప్రియుడి కారులోనే బయటకు తీసుకెళ్లి రోడ్డుపై పడేసింది. అతడి శరీరంపై నుంచి వాహనాలు వెళ్లడంతో బెనర్జీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఆ తర్వాత తన భర్త రోడ్డుప్రమాదంలో చనిపోయాడని శాంతి అందరినీ నమ్మించింది. అయితే పోస్టుమార్టం రిపోర్టులో బెనర్జీ శరీరంలో మత్తుపదార్థం ఉన్నట్లు డాక్టర్లు చెప్పడంతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. దీంతో శాంతి కాల్‌డేటా పరిశీలించగా అసలు గుట్టు బయటపడింది. తన సుఖానికి అడ్డొస్తున్నాడన్న కక్షతో ప్రియుడితో కలిసి తానే భర్తను చంపినట్లు శాంతి అంగీకరించింది. దీంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అక్రమ సంబంధం కోసం భర్తను చంపి శాంతి జైలుకెళ్లడంతో వారి ఒక్కగానొక్క కొడుకు అనాథగా మిగిలాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here