భర్త కొడుకు ముందరే ఆమెని గ్యాంగ్ రేప్ చేసారు

సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే దారుణం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ఘటన వివరాల్లోకి వెళ్తే… అనారోగ్యంతో బాధపడుతున్న మూడేళ్ల కుమారుడిని వైద్యుడికి చూపించేందుకు భార్య (30), భర్తలు ద్విచక్రవాహనంపై ముజఫర్ నగర్ వెళ్లారు. బాలుడికి వైద్యపరీక్షలు చేయించిన అనంతరం వారు వెనుదిరిగారు. వారు ముజఫర్ నగర్ శివార్లకు చేరుకుంటున్న సమయంలో కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని ఆగంతుకులు వారిని అడ్డగించారు.
అనంతరం భర్తను కొట్టి, భార్యకు తుపాకి గురిపెట్టి ఆమెను రోడ్డుపక్కనున్న చెరకుతోటలోకి లాక్కెళ్లి అతని ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారు పరారైన అనంతరం అక్కడి పొలంలో పని చేసే రైతుల సాయంతో భార్యాభర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించిన పోలీసులు, కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here