కేసీఆర్ కి ఇంకా గుర్తుందా..చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ

సీఎం కేసీఆర్ చిరంజీవి స్థాపించిన పార్టీ ప‌త‌నం పై ఎద్దేవా చేస్తూ కామెంట్ చేశారు. ప్ర‌జారాజ్యం..! మెగ‌స్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ. అయితే ఎన్నిక‌ల్లో  ఆపార్టీ ఊహించ‌నంత‌గా నామ రూపాల్లేకుండా పోయింది. ఎన్నిక‌ల్లో ఓట‌మితో కుంగిపోయిన చిరంజీవి ప్ర‌జారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ పార్టీ నుంచి కేంద్ర‌మంత్రిగా ఎంపిక‌య్యారు.

పార్టీని అంద‌రు మ‌రిచిపోతున్నా కొంద‌రు నేత‌లు మాత్రం ఊదాహ‌ర‌ణ తీసుకొని ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో సింగ‌రేణి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన సీఎం కేసీఆర్ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంట‌ర్వ్యూలో ఫ్రొఫెసర్ కోదండ‌రాంపై మండిప‌డ్డారు. పంచాయతీ స‌భ్యుడిగా గెల‌వ‌ని కోంద‌డం రాం మాకు నీతులు చెప్ప‌డ‌మా అంటూ నిప్ప‌లు చెరిగారు.

అంతెందుకు చిరంజీవి పార్టీ పెడితే .. ఆ పార్టీని క‌ట్టెల మోపును కింద ప‌డేసిన‌ట్లు  ప్ర‌జ‌లు  ప‌డేయలేదా అంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టారంటే ఆయనకు జనంలో ఎంతో విశ్వసనీయత వున్నదనీ, అందువల్ల ఆయన మనగలిగారని త‌న దైవ భ‌క్తి  చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here