ముంబయిలో మంటలు.. ఉలిక్కిపడ్డ సచిన్, ఐష్

దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ మంగళవారం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో సచిన్.. ఐశ్వర్యల కుటుంబ సభ్యులుండే ఉండే ఓ లగ్జరీ అపార్ట్ మెంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ అపార్ట్ మెంట్ లోని వేర్వేరు ఫ్లాట్లలో సచిన్ కు చాలా దగ్గరైన బంధువులు.. ఐష్ తల్లి ఉన్నారు.

ఐశ్వర్య తల్లి 12వ అంతస్థులో ఉండగా.. 13వ ఫ్లోర్ నుంచి మంటలు మొదలయ్యాయి. తర్వాత మంటలు 11-12 అంతస్థులకూ వ్యాపించాయి. ఐతే వెంటనే అందరూ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సచిన్ బంధువులు.. ఐశ్వర్య తల్లి క్షేమంగా తమ ఫ్లాట్ల నుంచి బయటికి వచ్చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిసింది. ఐతే ఆస్తి నష్టం మాత్రం బాగానే జరిగిందట.

అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని అందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. మంటలు ఆర్పారు. సచిన్.. ఐశ్వర్యలతో పాటు పలువురు ప్రముఖులు ఘటనా స్థలానికి వెళ్లి తమ వాళ్లను పరామర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here