అభివృద్ధిలో పోటీ ప‌డుతున్న డోకిపర్రు

మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ అధినేతలు తమ ధాతృత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. కన్నతల్లిని, సొంత ఊరిని మరవ కూడదనే నానుడిని నిజం చేస్తూ తమ స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండం డోకిపర్రు గ్రామంలోని ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించాలనే లక్ష్యంతో నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి మేఘా సంస్థ అధినేతలు పిపి రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి డోకిపర్రులో నిర్మించిన రెండు లక్షల లీటర్ల సామర్ధ్యం కలిగిన మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. దీనితో పాటు 1500 ఇళ్లకు మంచినీటి కుళాయిలను ఈ నెల 14న ప్రారంభించనున్నారు.

డోకిపర్రు గ్రామంలో ప్రస్తుతం గ్రామ పంచాయితీ ఏర్పాటు చేసిన పబ్లిక్‌ నల్లాలు, పంచాయితీ ఇంటింటికి మంజూరు చేసిన కనెక్షన్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామ పంచాయితీకి నగదు చెల్లించిన వారికే ఈ కనెక్షన్లు ఇచ్చేవారు. ఇప్పటికే ఎంఈఐఎల్‌ డోకిపర్రు గ్రామాన్ని దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యకమ్రాలను చేపట్టిన సంస్థ సురక్షిత మంచినీటిని అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా నాలుగు కోట్ల ఖర్చుతో గ్రామం మొత్తానికి మంచి నీటి పైప్‌లైన్‌, ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేశారు. గ్రామం అంతటికీ సురక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా రెండు లక్షల లీటర్ల సామర్ధ్యం ఉన్న మంచినీటి ట్యాంక్‌ను నిర్మించారు. గతంలో గ్రామ పంచాయితీ నిర్మించిన ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌కు అవసరమైన మరమ్మత్తులు చేశారు.

పామిరెడ్డి కృష్ణారెడ్డి, భద్రమ్మ జ్ఞాపకార్ధం ఎంఈఐఎల్‌ సంస్థ ప్రతి ఇంటికి నీటి కుళాయి, ఉచిత సురక్షితమంచినీటి పథకంలో భాగంగా ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ద్వారా ఇక నుంచి మంచి నీటిని మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ అందించనున్నది. ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌, మంచినీటి పైప్‌లైన్లు, కుళాయిలను ఈ నెల 14న ఎంఈఐఎల్‌ చైర్మన్‌ శ్రీ. పీపీ రెడ్డి మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ. పీ.వీ కృష్ణారెడ్డిలు ప్రారంభించనున్నారు. గ్రామంలో ఇప్పటికే ఎంఈఐఎల్‌ చైర్మన్‌ మరియు ఎండీ ఆధ్వర్యంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మించారు. దేవాలయానికి అనుబంధంగా నిర్మించిన కల్యాణమండపాన్ని స్థానికులు పెళ్లిళ్లు నిర్వహించుకునేందుకు ఉచితంగా అందిస్తున్నారు.

దేవాలయంలో రోజు అన్నదాన కార్యకమ్రం కూడా కొనసాగుతోంది. స్థానికంగా ఉన్న ఎస్‌టీ కాలనీ ప్రజల ఇబ్బందులను తొలిగించేందుకు మేఘా సంస్థ రూ. 50 లక్షల ఖర్చుతో సిఎస్‌ఆర్‌ పథకం కింద బ్రిడ్డిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే గ్రామంలోని అన్ని వీధుల్లో ఎల్‌ఈడి లైట్లను ఏర్పాటు చేశారు. డోకిపర్రు గ్రామంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా 700 గృహాలకు రెడీమేడ్‌ మరుగుదొడ్లను ఎంఈఐఎల్‌ సంస్థ అందచేసింది.

తోట్లవల్లూరు మండలం భద్రిరాజు పాలెం గ్రామ ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేందుకు ఎంఈఐఎల్‌ సంస్థ రూ. 15 లక్షలతో కొమ్మారెడ్డి బసివిరెడ్డి జ్ఞాపకార్ధం ఆర్‌ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేయటంతో పాటు నిర్వహణ బాధ్యతను చేపట్టి ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగిస్తోంది. మొవ్వ మండలం కాజ గ్రామంలో స్వచ్ఛ భారత్‌ పథకం కింద ఉచితంగా రెడీమేడ్‌ మరుగుదొడ్లను ఎంఈఐఎల్‌ అందించింది. గ్రామం అంతటికీ ఉచితంగా పైప్‌లైన్‌ ద్వారా రక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకొంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here