ప్రభాస్ తన అభిమానులకు ఇస్తున్న కానుక

బాహుబలి  వంటి బ్లాక్ బస్టర్ సినిమా తో భారతదేశ చలనచిత్ర పరిశ్రమలు లో అద్భుతమైన రికార్డులు సృష్టించిన యంగ్ రెబాల్  స్టార్ ప్రభాస్ ప్రస్తుతం  సుజిత్ దర్శకత్వం లో యు వి క్రియేషన్స్ నిర్మిస్తున్న సాహూ సినిమా లో నటిస్తున్నాడు..అయితే సాహో సినిమా షూటింగ్ ప్రస్తుతం మెల్లగా నడుస్తుంది సినిమాకు సంబంధించి ముఖ్యమైన సన్నివేశాలు అన్నీ దుబాయ్ లో చిత్రీకరించాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ యూనిట్ సబ్యులకు పర్మిషన్ దొరకలేదు.

ఇదివరకు ఒకసారి అనుమతి దొరికినపుడు, యూనిట్ వేరొక షెడ్యూల్ తో బిజీ గా ఉండడంతో అప్పుడు వెళ్లడం కుదరలేదు, ఇప్పుడేమో పర్మిషన్ దొరికేవరకు వేచిచూడక తప్పేలాలేదు.అయితే ఈసారి మాత్రం షూటింగ్ అందరు గా పూర్తి చేయాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఉంది…అయితే ఈ క్రమంలో హీరో ప్రభాస్ తన తదుపరి సినిమా స్టార్ట్ చేయడానికి సిద్ధమైపోయారు ఈ సినిమాను రాధాకృష్ణతో చేస్తున్నారని ఇది వరకే మనందరికీ తెలుసు..అయితే ఈ సినిమా మాత్రం సాహో  పూర్తయ్యేలోపు స్టార్ట్ చేయాలని ఉద్దేశ్యంతో హీరో ప్రభాస్ వున్నారు.

సాహో సినిమా సంవత్సరం ప్రథమార్థంలో విడుదలవుతుందని సమాచారం,అలాగే రాధా కృష్ణ సినిమా కూడా సంవత్సరం చివరాఖరికల విడుదల చేయాలనే ఉత్సాహంతో ఉన్నాడట హీరో ప్రభాస్ దానికి తగ్గటు డేట్స్ కూడా ఇచ్చేశాడట. ఈ క్రమంలో హీరో ప్రభాస్ తన అభిమానులకు ఈ సంవత్సరం రెండు సినిమాలతో పలకరిస్తాడు ఇదే జరిగితే ప్రభాస్ అభిమానులకు పండగే పండగ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here