‘అర్జున్ రెడ్డి’ సినిమా హీరో తో హారర్ మూవీ

తెలుగు ఇండస్ట్రీలో గత ఏడాది విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా అనేక సంచలనాలు సృష్టించింది మినిమం బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా మంచి లాభాలు తీసుకొచ్చింది..అంతేకాకుండా దర్శకుడు కి మంచి పేరు తీసుకు వచ్చింది..అలాగే హీరో విజయ్ దేవరకొండ కు వన్ నైట్ స్టార్ డమ్ తీసుకుని వచ్చిందనడంలో సందేహం లేదు.ప్రస్తుతం హీరో విజయ్ చేతిలో అరడజను సినిమాలున్నాయి.

ఇందులో 3 సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. మిగతా మూడు సినిమాలు త్వరలోనే షూటింగ్ కి  రెడీ అవుతున్నాయి.అయితే ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం…ఈ సినిమా హారర్ నేపథ్యంలో సాగుతుందట.. ‘ది ఎండ్’ అనే ఒక చిత్రాన్ని తెరకెక్కించిన రాహుల్ తో ఈ సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఒక అద్భుతమైన థ్రిల్లర్ అని, ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని నిర్మాతలు అంటున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here