కమల్ విక్రమ్ కలయికలో సినిమా

సౌతిండియా విలక్షణ నటుడు మరియు ఎన్నో అద్భుతమైన పాత్రలు తో ప్రేక్షకులను మెప్పించిన హీరో కమలహాసన్ భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్నాడు…అయితే ఇదే తరహాలో కోలీవుడ్  ఇండస్ట్రీకి చెందిన హీరో విక్రమ్  కూడా పేరు సంపాదించాడు. ఇప్పుడు వీరిద్దరు కలయికలో ఓ సినిమా వస్తున్నట్లు  సమాచారం…అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ నటించడం లేదు నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తున్నారట.

అయితే ఈసినిమాను కమల్ హసన్ హీరోగా ‘చీకటి రాజ్యం’ అనే సినిమా చేసిన ఆయన శిష్యుడు రాజేష్ సెల్వ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. ‘చీకటి రాజ్యం’ తరహాలోనే రాజేష్-విక్రమ్ కాంబినేషన్లో రాబోయేది కూడా ఫ్రెండ్ సినిమా థ్రిల్లర్ రీమేకేనట. ఈ చిత్ర రీమేక్ హక్కులు కూడా తీసుకున్నారట. ‘చీకటి రాజ్యం’ విషయంలో కమల్ జోక్యం చాలా ఉందన్నది అందరికీ తెలుసు. ఐతే విక్రమ్ సినిమా విషయంలో మాత్రం రాజేష్‌కు పూర్తి ఫ్రీడం ఇవ్వబోతున్నాడట కమల్.

అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పట్టలేక పోతున్నట్లు సమాచారం..ఈ చిత్రాన్ని తన సొంత బేనర్ ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్’లో తీస్తున్నట్లు సమాచారం.గతంలో కూడా ఇదే బ్యానర్లో వేరే హీరోలతో కమల్ హాసన్ సినిమాలు తీయడం జరిగింది.ప్రస్తుతం చర్చల్లో ఉన్న కమల్ ,విక్రమ్ ప్రాజెక్ట్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here