‘పద్మావతి’ సినిమా విడుదల చేయనివ్వం!

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పద్మావతి’ సినిమా వివాదాలకు కేంద్రబిందువైంది దీపికా పదుకొనే లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్,రణవీర్ సింగ్ కూడా నటిస్తున్నారు.ఈమధ్య సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా  5 కట్స్  మినహా సినిమా అంతా బానే వచ్చిందని సెన్సార్  చీఫ్ ప్రసూన్ జోషీ అన్నారు.

అయితే ఈ చిత్రాన్ని ఈనెల 25న విడుదల చేయడానికి ‘పద్మావతి’ సినిమా యూనిట్ సిద్ధపడుతున్న సమయంలో…సినిమాను పూర్తిగా నిలిపి వేయాలంటూ రాజ్ పుత్ లు కర్ణి సేన భారీ ర్యాలీ నిర్వహిం చడానికి సిద్ధపడుతున్నారు…ఈ ర్యాలీ ద్వారా రాజ్ పుత్ లు కర్ణి సేన తమ ఉద్దేశాన్ని చాటి చెప్పాలని  భావిస్తున్నారట.

ఎందుకంటే సెన్సార్ వెళ్లిన క్రమంలో సినిమాలో కొన్ని సీన్స్  రాజ్ పుత్ లు.. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అప్పట్లో స్పెషల్ స్క్రీనింగ్ కమిటీ చిత్ర యూనిట్ కు సూచించిందట.ఈ క్రమంలో ఉద్దేశ్యపూర్వకంగా రాజ్ పుత్ కర్ణి సేన ఇలా చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏకంగా ఓ సినిమాపై పూర్తిగా నిషేధం విధించాలనే మాటలను ఫిలిం లవర్స్ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here