దళిత పెళ్లి ఘనంగా జరిగింది అని .. పెద్ద కులం వాళ్ళు చేసిన నిర్వాకం ఇది

స్వతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు దాటుతున్నా కూడా వర్ణ వివక్ష , జాతి వివక్ష ఈ దేశం లోనుంచి పోవడం లేదు. తమ కూతురు కి ఒక దళితుడు ఘనంగా పెళ్లి చేసాడు అనే కుళ్ళు తో అతను , అతని వర్గం వారు ఉపయోగించే మంచినీళ్ళ బావి లో కిరసనాయిల్ పోశారు కొందరు అగ్రవర్ణాల వారు. మధ్య ప్రదేశ్ లోని మానా లో మేఘా వాల్ దళిత వర్గానికి చెందిన వ్యక్తి. తన కూతురు వివాహం ఘనం గా జరిపించాలి అని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న అతను అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాడు. దీంతో గ్రామం లో అగ్రవర్ణాల వారు అతనిమీద కయ్యానికి కాలు దువ్వారు.

బ్యాండ్ మేళం పెట్టవద్దని హెచ్చరించారు. తమ ఆదేశాలు ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీసుల హెల్ప్ తీసుకుని మరీ మేఘా వాల్ తన కూతురు పెళ్లి ఫుల్ గ్రాండ్ గా చేసాడు. దీంతో తమ మాట లెక్కచెయ్యలేదు అని ఆగ్రహానికి గురైన వేరే కులస్తులు గ్రామంలో దళితులంతా తాగేందుకు వినియోగించే మంచినీటి బావిలో కిరోసిన్ ను కలిపారు. దీంతో దళితులంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here