ఆ రోజులు పోయాయి బాబూ..

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో ప్రతిప‌క్ష నేత చంద్ర‌బాబు వైఖ‌రిపైనే ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వానికి 48 గంట‌ల డెడ్‌లైన్ విధించి చంద్ర‌బాబు పెద్ద త‌ప్పు చేశార‌నే అనిపిస్తోంది. 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకునే చంద్ర‌బాబు అధికార పార్టీపై ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడ‌టం ఆయ‌న‌కే చెల్లిందంటున్నారు.

అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు మాట్లాడ‌టం చంద్ర‌బాబుకు వెన్న‌తోపెట్టిన విద్య అంటారు. స‌రిగ్గా ఇప్పుడు చంద్ర‌బాబు తీరును గ‌మ‌నిస్తున్న వారికి ఇది క‌రెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మూడు రాజ‌ధానుల అంశం విష‌యంలో ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు ఇస్తుంటే చంద్ర‌బాబు మాత్రం దీన్ని అడ్డుకుంటున్నారు. ఇంత‌టితో ఆగ‌కుండా అధికార పార్టీ వారంతా రాజీనామాలు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని చెబుతున్నారు. దీంతో దిక్కుతోచ‌ని స్థితిలో చంద్రబాబు యూట‌ర్న్ తీసుకుంటున్న‌ట్లు చ‌ర్చ న‌డుస్తోంది.

యూట‌ర్న్ తీసుకోవ‌డం చంద్ర‌బాబుకు పెద్ద స‌మ‌స్య‌మే కాదు. ముందుగా చంద్ర‌బాబు త‌న ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయిస్తార‌ని పొలిటిక‌ల్ పుకార్లు పుట్టించారు. ఆ త‌ర్వాత ఏం చేయ‌లేక అధికార పార్టీ నేత‌లు రాజీనామాలు చేయాల‌ని ఆగ్ర‌హంగా మాట్లాడుతున్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే తాను రాజీనామా చేయ‌లేక‌నే చంద్ర‌బాబు ఇలా యూ ట‌ర్న్ తీసుకొని మాట్లాడుతున్న‌ట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.

చంద్ర‌బాబు ఒక్కోసారి ఒక్క విధంగా మాట్లాడ‌టం అల‌వాటుగా పెట్టుకున్నారు. ఒక్క‌సారి గ‌తాన్ని ప‌రిశీలిస్తే 2018లో ప్ర‌త్యేక‌హోదా ఇవ్వ‌నందుకు నిర‌స‌న‌గా వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి పోరాడ‌తాం మీరు కూడా రావాల‌ని అడిగితే అప్పుడు చంద్ర‌బాబు ఇచ్చిన స‌మాధానం హాస్యాస్ప‌దంగా ఉంది. రాజీనామాలు చేస్తే ఏ మొస్తుంద‌ని. రాజీనామాలు కుట్ర అన్నారు బాబు. అలాంటి చంద్ర‌బాబు నేడు మళ్లీ రాజీనామాల గురించి మాట్లాడుతున్నారు.

అప్ప‌ట్లో చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగానే ఇప్పుడు కూడా వ్య‌వ‌హ‌రిస్తామంటే ప్ర‌జ‌లెవ్వ‌రూ చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే ఏ విష‌య‌మైన అప్పుడు చంద్ర‌బాబు చెబితే ఒక‌టి రెండు రోజుల‌కు అది ప్ర‌జ‌ల్లోకి వెళ్లేది. అయితే నేడు ఆ ప‌రిస్థితి లేదు. ఆయ‌న వైఖ‌రి ఏంటో సోష‌ల్ మీడియా ద్వారా నిమిషాల్లో రాష్ట్ర ప్ర‌జ‌లు అంచ‌నా వేసుకుంటున్నారు. ఎవ‌రికి వారు రాజ‌కీయ ఎత్తుగ‌డుల గురించి సొంతంగా ఆలోచించుకుంటున్నారు. గ‌తంలో ఆయ‌న ఏ విధంగా మాట్లాడింది. ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్న‌దీ ప్ర‌తీది విశ్లేష‌ణాత్మంగా తెలుసుకుంటున్నారు.

రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు కూడా చంద్ర‌బాబు ఇంత‌లా గ‌గ్గోలు పెట్ట‌లేదు. కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తామంటే అందుకు ఒప్పుకోకపోవడం. ప్ర‌తి అంశంలోనూ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు వెతుక్కునే చంద్ర‌బాబు అమ‌రావతి రాజ‌ధాని అంశంలో కూడా ఇదే పంథా కొన‌సాగిస్తున్నారు. ఇందుకు నిద‌ర్శ‌న‌మే రాయ‌ల‌సీమ వాసి బిటెక్ ర‌వి రాజీనామా అస్త్రం. త‌న కుమారుడి నుంచే రాజీనామా చేయించి ఉండాల్సిన చంద్ర‌బాబు ఆ దిశ‌గా అడుగులు వేయ‌కుండా కేవ‌లం త‌న రెండు క‌ళ్ల సిద్దాంతం ఉప‌యోగించారని తెలుస్తోంది. ఎందుకంటే రాయ‌ల‌సీమ‌లోనే మూడు రాజ‌ధానుల అంశాన్ని వ్య‌తిరేకిస్తూ నేత‌లు రాజీనామా చేశార‌ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేలా చంద్ర‌బాబు ప్లాన్ వేశార‌ని తెలుస్తోంది.

మొత్తం మీద చంద్ర‌బాబు చెప్పిన‌వ‌న్నీ న‌మ్మేయ‌డానికి ఇవి పాత‌రోజులు కాదు. ఇప్పుడంతా సోష‌ల్‌మీడియా వ‌చ్చేసింది. ఆయ‌న మీడియాలో ఎంత చెప్పినా వినే స్థితిలో ప్ర‌జ‌లు లేరు. ఎవ‌రికి వారు సొంతంగా రాజకీయాల గురించి ఆనాల‌సిస్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు.బాబు కి యూటర్న్ లో డాక్టరేట్ ఇవ్వాలి అని యూ టర్న్ తాతా  అని సోషల్ మీడియా లో పోస్టులే పోస్టులు.

మళ్ళీ యూటర్న్ఇంకా ఎన్నాళ్లు సార్ ఇలా…

 

చంద్ర‌బాబు వైఖ‌రిపై రాజ‌కీయ విశ్లేష‌కులు ఏమ‌న్నారంటే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here