చంద్ర‌బాబు వైఖ‌రిపై రాజ‌కీయ విశ్లేష‌కులు ఏమ‌న్నారంటే..

మూడు రాజ‌ధానుల అంశంపై టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు వైఖ‌రిపై మేధావులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. త‌న పార్టీ ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయించాల్సిన బాబు.. అధికార పార్టీ ఎమ్మెల్యేల ద‌గ్గ‌ర‌కు రావ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

వికేంద్రీక‌ర‌ణ‌ను వైసీపీ త‌న మెనిఫెస్టోలోనే పెట్టింది. అందుకే వై.ఎస్ జ‌గ‌న్ మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేశారు. అయితే ఇక్క‌డ వికేంద్రీక‌ర‌ణకు అన్ని ప్రాంతాలు మొగ్గు చూపుతూనే ఉన్నాయి. ప్ర‌జ‌లంద‌రూ రాష్ట్రం మొత్తం అభివృద్ది చెందాల‌ని.. ఏ ఒక్క ప్రాంతంలోనే అభివృద్ధి కేంద్రీకృతం కాకూడ‌ద‌ని అంటున్నారు. మామూలుగా అయితే ఎవ్వ‌రైనా ఏ విష‌యంలోనైనా వ్య‌తిరేకంగా ఉన్న వారు వారి బ‌లాన్ని నిరూపించుకొని అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంటారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఇప్పుడు చంద్ర‌బాబు ఉన్నారు.

మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకం అంటూ చంద్ర‌బాబు చెప్తున్న‌ప్పుడు ఆయ‌నే ప్ర‌జ‌లు త‌మ వైపు ఉన్నార‌ని నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఎలాగంటే ఆయ‌న రాజీనామాలు చేసి ప్ర‌జాక్షేత్రంలోకి వెళ్లి మ‌ళ్లీ గెలిచి ప్ర‌జ‌లు ఆయ‌న వైపే ఉన్నార‌ని ప్రూవ్ చేయొచ్చు. అలా చేస్తే రాష్ట్రం మొత్తం చంద్ర‌బాబు వైపే ఉన్నార‌ని అర్థ‌మ‌వుతుంది. అలా కాకుండా అధికార పార్టీ వారు రాజీనామాలు ఎందుకు చేస్తారు. ఈ చిన్న లాజిక్ చంద్ర‌బాబుకు తెలియ‌దా అంటే తెలుసు. కానీ గ‌వ‌ర్న‌ర్ ఆమోదం త‌ర్వాత బిల్లుల‌ను ఆప‌డం అంత ఈజీ కాదు. ఈ నేప‌థ్యంలో ఏం చేయ‌లో తెలియ‌క అధికార పార్టీ మీద ప‌డి మాట్లాడ‌టం మొద‌లు పెట్టారు.

ఎలాగూ భారీ మెజార్టీ సాధించి వైసీపీ అధికారం చేప‌ట్టింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు వైసీపీ వైపే ఉన్న‌ట్లు అంద‌రికి తెలుసు. ఈ నేప‌థ్యంలో కావాల‌ని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల‌న‌డం చంద్ర‌బాబు వితండ‌వాదాన‌కి నిద‌ర్శ‌న‌మ‌న్న‌ట్లు తెలుస్తోంది. ముందు చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ‌, విశాఖ ప్రాంతాల ప్ర‌జాప్ర‌తినిధుల‌తో రాజీనామాలు చేయించాలి. ఎందుకంటే ఆ ప్రాంత నేత‌లు రాజీనామా చేసి గెలిస్తే సొంత ప్రాంతంలో రాజ‌ధానులు వ‌ద్ద‌ని అమ‌రావతిలోనే రాజ‌ధాని ఉండాల‌ని ప్ర‌జ‌లు కోరుకున్న‌ట్లు అవుతుంది. మ‌రి ముందుగా చంద్ర‌బాబు ఆ ప‌ని చేస్తే బాగుంటుంది. చూద్దాం 48 గంట‌ల స‌మ‌యం ఇచ్చిన చంద్ర‌బాబు ఆ త‌ర్వాత ఎలా ముందుకు వెళ‌తారో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here