ట్వీట్ల వివాదంపై రజినీ స్పందించాల్సిందే..

సూప‌ర్ స్టార్ రజినీకాంత్ ట్విట్ట‌ర్ అకౌంట్ల‌పై ఇప్పుడు టాపిక్ న‌డుస్తోంది. ఆయ‌న పేరుమీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ట్వీట్లు చేస్తున్నారంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై క్లారిటీ లేదు. దీంతో స్వ‌యంగా ఆయ‌న రంగ‌రంలోకి దిగితే త‌ప్ప ఫులిస్టాప్ ప‌డేలా క‌నిపించ‌డం లేదు.

అస‌లు విష‌యానికొస్తే త‌మిళ‌నాడులో క‌రోనా విజృంభిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రజినీకాంత్ త‌న రెండో కూతురు అల్లుడితో క‌లిసి కీళంబాక్కంలోని ఓ ఫామ్ హౌస్‌లో ఉన్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. అయితే ప‌బ్లిక్ బ‌య‌ట‌కు రావాలంటేనే నిబంధ‌న‌లు ఉన్న నేప‌థ్యంలో క‌చ్చితంగా ఈ పాస్ తీసుకొని బ‌య‌ట‌కు రావాల‌ని ప్రభుత్వం ఆంక్ష‌లు విధించింది. ఈ నేప‌థ్యంలో ర‌జినీకాంత్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవ్వ‌డంతో ఆయ‌న ఈ పాస్ తీసుకొని బ‌య‌ట తిరుగుతున్నారా అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

అయితే రజినీకాంత్ నిబంధ‌న‌ల మేర‌క్ న‌డుచుకుంటార‌ని.. ఈ పాస్ తీసుకొనే కీళంబ‌క్కం వ‌ర‌కు వెళ్లి ఉంటార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. అక్క‌డితో ఈ వివాదం ముగిసిపోయింద‌నుకుంటే మ‌ళ్లీ ఇప్పుడు కొత్త ట్వీట్ వ‌చ్చి తంటా పెట్టింది. నేను ఈ పాస్ లేకుండా ప్ర‌యాణించాను. మీ బిడ్డ‌గా ప‌రిగ‌ణించి న‌న్ను క్ష‌మించ‌డం అంటూ ర‌జినీ పేరు మీద ఓ ట్వీట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో విష‌యం అంతుచిక్క‌డం లేదు. అయితే ర‌జినీ కాంత్ అధికారిక ఖాతా కాకుండా కొంద‌రు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ర‌జినీ అధికారిక ట్వీట్ 2013లో తెరిచి ఉంటే.. ఇప్పుడు మెసేజ్ వ‌చ్చిన ట్వీట్ మాత్రం ఈ మ‌ధ్యే ఓపెన్ చేసింది. ఏదిఏమైనా ర‌జినీకాంత్ స్వ‌యంగా ప్ర‌క‌టిస్తే త‌ప్ప ఈ ట్వీట్ల వివాదానికి ప‌రిష్కారం దొరికేలా లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here