ప్రియాంకా ప్లేస్ ని భర్తీ చేయనున్నకృతిస‌న‌న్..?

క్రిష్ 4 సినిమాలో ఏ పాత్ర తీసుకున్నా కాస్త విభిన్నంగానే క‌నిపించేలా ద‌ర్శ‌కులు ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో నాలుగు పాత్ర‌ల్లో న‌టిస్తున్న హృతిక్‌కు స‌ర‌స‌న న‌టించే ముద్దుగుమ్మ విష‌యంలో ఈ సారి కొంచెం కొత్త‌గా ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

హృతిక్ రోష‌న్ తాజా చిత్రంపై విభిన్న‌మైన వార్త‌‌లొస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయ‌న క్రిష్ 4 కూడా చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌న తండ్రి రాకేష్ రోష‌న్ డైరెక్ష‌న్‌లోనే ఇది రూపొంద‌నుంది. కాగా కోయి మిల్ గ‌యాలోని గ్ర‌హాంత‌ర వాసి పాత్ర కూడా ఈ సినిమాలో ఉన్న‌ట్లు పుకార్లు బ‌య‌ట‌కొచ్చాయి. అంతే కాకుండా క్రిష్ 4లో హృతిక్ నాలుగు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

సింగిల్‌గా వ‌చ్చినా హృతిక్ స్టైల్ వేరుగా ఉంటుంది. అలాంటిది నాలుగు రూపాల్లో వ‌స్తే ఇక ఏ విధంగా ఉంటుందో మ‌రి. కాగా ఈ సినిమాలో హీరోయిన్ పై క్లారిటీ లేదు. హీరోయిన్ కృతితో ఇప్ప‌టికే ఒప్పందం కుదురిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అయితే క్రిష్ సినిమాల్లో న‌టించిన ప్రియాంక‌ను మ‌ళ్లీ ఈ సినిమాలో తీసుకుంటార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కానీ ఈమె వేరే ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఒప్పందం కుద‌ర్చుకున్న కృతిస‌ననే ఓకే చేస్తార‌ని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here