అందుకే నో చెప్పానంటున్న పూజా హెగ్డే

యంగ్ హీరో నితిన్ స‌ర‌స‌న న‌టించేందుకు ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఒప్పుకోలేదు. కార‌ణాలు ఏమిటో క్లారిటీగా తెలియ‌దు కానీ మొత్తానికి నితిన్ స‌ర‌స‌న న‌టించేందుకు సంప్ర‌దించిన హీరోయిన్ నో చెప్ప‌డం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ న‌డుస్తోంది.

హిందీలో అంధాదూన్ మూవీ మంచి సక్సెస్ సాధించింది. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టేలు జంట‌గా న‌టించిన ఈ చిత్రం హిందీలో హిట్ కొట్టింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నితిన్ హీరోగా మేర్ల‌పాక గాంధీ ఈ చిత్రాన్ని తీస్తున్నారు. అయితే హీరోయిన్ కోసం పూజాను సంప్ర‌దించ‌గా చిత్ర‌బృందానికి నో చెప్పింది ఈమె.

ఈ మ‌ధ్య వ‌రుస విజ‌యాల‌తో మంచి ఫామ్‌లో ఉన్న పూజా అయితే సరిపోతుంద‌ని అనుకున్నారు. కాగా సినిమాలో హీరోయిన్ పాత్ర‌కు అంత ప్రాముఖ్య‌త ఉండ‌ద‌ని నిరాక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అయితే మ‌రికొంద‌రు మాత్రం పారితోషికం విష‌యంలో ఇబ్బందులు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా పూజా రిజెక్ట్ చెయ్య‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది.

ప్రియాంకా ప్లేస్ ని భర్తీ చేయనున్నకృతిస‌న‌న్..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here