ముస్లీం యువ‌తి చేతిపై శ్రీ‌రామ్‌..

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి మ‌రి కొద్ది గంట‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ద‌శాబ్దాలుగా ఎదురుచూస్తున్న బృహ‌త్త‌ర ఘ‌ట్టానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అయితే ఇదే స‌మ‌యంలో మ‌తాల‌కు అతీతంగా ఓ ముస్లీం మ‌హిళ త‌న చెయ్యిపై శ్రీ‌రామ్ అని టాటూ వేయించుకొని అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది.

ముస్లీం య‌వ‌తి త‌న చెయ్యిపై శ్రీ‌రామ్ అనే అక్ష‌రాలు ప‌చ్చ‌బొట్టు వేయించుకుంది. రేపు అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాప‌న జ‌రుగుతున్న వేళ ఓ ముస్లీం యువ‌తి ఇలా టాటూ వేయించుకోవ‌డం అన్ని మ‌తాలు ఒక్క‌టే అన్న దానికి నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. బెనార‌స్‌కు చెందిన ఇక్రాఖాన్ అనే యువ‌తి శ్రీ‌రామ్ అని ప‌చ్చ బొట్టు వేయించుకుంది.

చాలా మంది ముస్లీంలు రామాల‌యం నిర్మాణం విష‌యంలో సంతోషంగా ఉన్నార‌ని ఆమె తెలిపింది. రామాల‌యం నిర్మాణం కోసం తాను కూడా ఎదురుచూస్తున్న‌ట్లు చెప్పింది. హింధూ ఆల‌యం కోసం ముస్లీం మ‌హిళ ఎదురుచూడటం చూస్తుంటే ఇంత క‌న్నా శుభ‌ప‌రిణామం ఇంకేముంటుంద‌ని నెటిజ‌న్లు పొగిడేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here