సంక్రాంతి బ‌రిలో కేజీఎఫ్ 2…?

కేజీఎఫ్ సినిమా వ‌సూళ్ల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే. యష్ హీరోగా వ‌చ్చిన ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ తెలుగు రాష్ట్రాలలో ఊహించిన దానికంటే ఎక్కువ‌గానే వ‌సూళ్లు చేసింది. ఇప్పుడు మ‌రోసారి య‌ష్ సిద్ధ‌మ‌వుతున్నారు.

కేజీఎఫ్ సినిమా తెలుగు రాష్ట్రాల‌లో రూ. 12.27 కోట్లు వ‌సూల్ చేసింది. ఇప్పుడు కేజీఎఫ్‌ 2 మూవీ రిలీజ్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. కేజీఎఫ్‌తో మంచి హిట్ అందుకున్న చిత్ర బృందం ఇప్పుడు కేజీఎఫ్ 2పై ప‌డింది. ఆగ‌స్టు 15వ తేదీ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇది సెప్టెంబ‌ర్ వ‌ర‌కు విరామం లేకుండా కొన‌సాగ‌నుంది. దీంతో సినిమా షూటింగ్ ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని యూనిట్ ప‌ట్టుద‌ల‌తో ఉంది.

2021 సంక్రాంతికి ఈ సినిమా బ‌రిలో ఉండే అవ‌కాశాలు ఎక్కువగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాపై అంచ‌నాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా రిలీజ్ అవుతుందంటేనే ప్రేక్ష‌కుల నుంచి కూడా మంచి స్పంద‌న వ‌స్తుంది. ఎందుకంటే గ‌త ఐదు నెల‌లుగా సినిమాలు లేవు. అదీ కాక కేజీఎఫ్ సినిమా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. దీంతో ఇప్పుడు కేజీఎఫ్ 2పై మ‌రిన్ని అంచ‌నాలున్నాయి.

అందుకే నో చెప్పానంటున్న పూజా హెగ్డే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here