న‌న్ను బ్ర‌తికించు అన్నో.. సమాధిలోంచి అన్నకు ఫోన్ చేసిన తమ్ముడు!

ఈరోజుల్లో మ‌నికీ ఉన్న వ్యాల్యూ మ‌నికిషికి కూడా ఉండ‌డంలేదు. ఆ మ‌నీకి ఎంత వ్యాల్యూ ఇస్తారంటే బ్ర‌తికున్న‌వాళ్ల‌ని చంపేసి స‌మాధి చేసేంత‌ ప్రయారటీ ఇస్తారు డ‌బ్బుకు. ఇది తెలిసీకూడా ఓ వ్య‌క్తి కొంత‌మంది ద‌గ్గ‌ర అప్పు చేశాడు. చేసిన‌వాడు తీర్చాలా లేదా. రేపు మాపు అంటూ డ‌బ్బు ఇచ్చిన‌వాళ్లు తిప్పించుకున్నాడు. అంతే సంగ‌తులు ఇంకోసారి ఇలా తిప్పించుకోకుండా చేయాల‌ని బ్ర‌తికున్న‌వాడిని కుళ్లిబొడిసారు. బాధితులు కొట్టిన దెబ్బ‌ల‌కు చ‌నిపోయాడు అని నిర్ధారించుకున్న త‌రువాత స‌మాధి చేసి ఎవ‌రి ప‌నుల్లో నిమ‌గ్నమ‌య్యారు. డ్యామిట్ అప్పుడే క‌థ అడ్డం తిరిగింది.
ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో కిక్ మెట్  వ్యాపారం చేస్తుండేవాడు. వ్యాపారాన్ని విస్త‌రించాలని తెలిసిన వాళ్ల‌ద‌గ్గ‌ర‌నుంచి పెద్ద‌మొత్తంలో రూ.3కోట్లను అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు, వ‌డ్డీ క‌ట్టాల్సి ఉండ‌గా, లాభాలు లేక అప్పు ఇచ్చిన వాళ్ల‌కు రేపు మాపు ఇస్తాన‌ని ముప్పుతిప్ప‌లు పెట్టించి మూడుచెరువులు నీళ్లు తాగించాడు. దీంతో మండిప‌డ్డ బాధితులు కిక్ మెట్ ను భ‌యంక‌రంగా కొట్టారు. ఆ దెబ్బ‌ల‌కు మూర్చ‌పోయాడు. అయితే ఇత‌గాడు చ‌నిపోయాడ‌ని భావించి ఓ ప్రాంతంలో పూడ్చిపెట్టారు.

ఇదిలా ఉండ‌గా మూర్చ‌పోయిన కిక్ మెట్ త‌న జేబులో ఉన్న సెల్ ఫోన్ స‌హాయంతో అన్న ఇస్మాయిల్ కు ఫోన్ చేసి తాను స‌మాధిలో ఉన్న‌ట్లు , బ్ర‌తికించాల‌ని కోరుకున్నాడ‌ట కిక్ మెట్ . ఒక్క ఫోన్ కాల్ తో అప్ర‌మ‌త్త‌మైన అన్న ఇస్మాయిల్  స‌మాదిలో ఉన్న కిక్ మెట్ ను వెలికి తీశారు. తీవ్ర‌మైన దెబ్బ‌ల‌తో హాస్ప‌త్రిపాలైన ఇస్మాయిల్ ..తాను చేసిన అప్పుల్ని తీర్చాల‌ని కోరార‌ట‌. ఆ అప్పుల్ని తీర్చేపనిలో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here