సంక్రాంతి కానుక‌గా చ‌ర‌ణ్‌, సుకుమార్‌ల చిత్రం “రంగస్థలం”

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సినిమా రూపొందుతోన్న చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా టైటిల్‌పై సోష‌ల్ మీడియాలో ఎన్నో ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. అలాగే టైటిల్ విష‌యంలో సోష‌ల్ మీడియాలో రామ్‌చ‌ర‌ణ్ పెట్టిన వీడియో వైర‌ల్ అయ్యింది. ఫైన‌ల్‌గా ఈ చిత్రానికి “రంగస్థలం” అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. “1985” అనేది ఈ టైటిల్ కి ఉపశీర్షిక.
రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో మూవీ అన‌గానే ఎన్నో అంచ‌నాలు మొద‌లైయ్యాయి. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా సినిమా ఉంటుంది.
 ఈ సినిమాకు “రంగస్థలం” అనే టైటిల్‌ను ఖ‌రారు చేశాం. భారీ బ‌డ్జెట్‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాం.  ఇప్ప‌టి వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్ చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ పాత్ర‌ను చేస్తున్నారు. విభిన్న‌మైన క‌థాంశాల‌తో సినిమాల‌ను రూపొందించే ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ చిత్రాన్ని కూడా అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉండేలా, అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేసేలా  అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్‌; ఆది స‌హా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ అందిస్తున్న స‌హ‌కారంతో సినిమా చాలా బాగా వ‌స్తుంది. అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేస్తాం. ప్రేక్ష‌కులు, మెగాభిమానులు అంచ‌నాల‌ను మించేలా, మా బ్యాన‌ర్ వేల్యూను పెంచేలా సినిమా ఉంటుంద‌ని నిర్మాత‌లు న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సివిఎం)లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here