జనం ప్రాణాలు తీస్తున్న సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నవనిర్మాణ దీక్షల పేరుతో జనాల ప్రాణాలు తీస్తున్నారని కాకినాడవాసులు మండిపతుడున్నారు. అంబులెన్స్ వస్తున్న సీఎం కాన్వాయ్ కోసం దాదాపు 20 నిమిషాలపాటు ట్రాఫిక్ ను క్లియర్ చేయకుండా అలాగే ఉంచడం ఏంటని తిట్టిపోస్తున్నారు. దీనికి తోడు ఉపముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో పోలీసుల ఓవర్ యాక్షన్ ఎక్కువైంది.
ఎక్కడైనా అంబులెన్స్ వెళుతుంటే పీఎం కాన్వాయ్ అయినా పక్కకు పోవాల్సిందేనని చెబుతుంటారు.
కానీ కాకినాడలో అలాజరగలేదు. నవనిర్మాణ దీక్షలతో బిజీగా ఉన్న చంద్రబాబు కాకినాడలో ప్రత్యక్షమయ్యారు. ఓ సెంటర్ నుంచి కాన్వాయ్ వెళ్లాల్సి ఉంది. అదే సమయంలో అటునుంచి రోగితో అంబులెన్స్ హారన్ కొడుతూ వస్తుంది. అయినా పట్టించుకోని పోలీసులు సీఎం కాన్వాయ్ కోసం అలానే ట్రాఫిక్ లో ఉంచారే తప్ప..ట్రాఫిక్ క్లియర్ చేసుందుకు ముందుకు రాలేదు. ఈ దుశ్చర్యను వీడియోతీసిన నెటిజన్లు సోషల్ మీడియాలో విడుదల చేయడంతో చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు. ప్రాణాలు పోతుంటే ట్రాఫిక్ క్లియర్ చే్యాల్సిన పోలీసులే సీఎం కోసం అంబులెన్స్ ఆపేయడం ఏంటని ఉతికి ఆరేస్తున్నారు. ఇంత జరిగినా పోలీస్ లు లైట్ తీసుకోవడమే కాదు… చిన్నవిషయం భూతద్దంలో ఎందుకు చూస్తున్నారంటూ రుసురుసలాడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here