సీఎం జగన్ టార్గెట్ చేశారు…వీరికి మాత్ర‌మే.

పేద‌ల ప్ర‌జ‌ల అభివృద్ధి కోస‌మే వైసీపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని ఎప్పుడూ చెప్పే ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన సంక్షేమ ప‌థ‌కాలు ప్రవేశ‌పెడుతూ ఏడాది కాలంలోనే ఆయ‌న శెభాష్ సీఎం అనిపించుకున్నారు. ఇప్పుడు మ‌రో ప‌థ‌కాన్ని తీసుకొచ్చి ఇంకో చ‌రిత్ర సృష్టిస్తున్నారు.

పించ‌న్లు పెంచ‌డం, రైతు భ‌రోసా అంద‌రికీ ఇవ్వ‌డం, ఆటో డ్రైవ‌ర్ల‌కు అండ‌గా ఉండ‌టం, అక్క చెల్లెమ్మ‌ల‌కు చేయూత పేరుతో ముందుకు వెళ్ల‌డం, అమ్మ ఒడితో త‌ల్లుల గుండెల్లో నిలిచిపోవ‌డం ఒక్క వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే సాధ్య‌మైంది. మునుపెన్న‌డూ లేనంతగా ప్ర‌జ‌ల కోసం సంక్షేమ ప‌థ‌కాలు తీసుకొచ్చిన ఘ‌న‌త జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. ఇప్పుడాయ‌న ఆరోగ్య ఆస‌రా ప‌థ‌కం తీసుకొచ్చారు.

ఆరోగ్య ఆస‌రా ప‌థ‌కం ద్వారా మ‌హిళ ప్ర‌సవించ‌గానే రూ 5వేలు అంద‌జేస్తారు. గ‌ర్బం దాల్చిన‌ప్ప‌టి నుంచి ప్ర‌స‌వించేవ‌ర‌కు అండ‌న్ వాడీల ద్వారా పౌష్టికాహారం అంద‌జేస్తున్న‌విష‌యం తెలిసిందే. ఇప్పుడు ప్ర‌స‌వం అవ్వ‌గానే రూ. 5వేలు ఇవ్వాల‌ని ఆయ‌న ఆదేశించారు. పేద‌ల సంక్షేమం కోసం నిరంత‌రం తాప‌త్ర‌య‌ప‌డే సీఎం జ‌గ‌న్ మ‌రో ప‌థ‌కం తీసుకురావ‌డం ప‌ట్ల పేద ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌ర్బ‌వ‌తులు, బాలింత‌లు, 36 నెల‌లోపు శిశువుల కార్య‌క‌లాపాల‌న్నీ ఒక‌లా చూడ‌నున్నారు. 36 నుంచి 72 నెల‌ల లోపు పిల్ల‌ల‌ను మ‌రోలా చూడాల‌ని సీఎం ఆదేశించారు. కాగా అడ‌గ‌కుండానే ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం వివిధ సంక్షేమ ప‌థ‌కాలు తీసుకొస్తున్న జ‌గ‌న్ ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షాతిరేకాలు వెల్లివిరుస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here