న‌గ్న‌చిత్రాలుగా మారుతున్న యువ‌తుల ఫోటోలు..

సోషల్ మీడియాలో ఇప్పుడు అంద‌రూ బిజీగా ఉంటున్నారు. అబ్బాయిలైతే ప‌ర్వాలేదు. కానీ అమ్మాయిలు కూడా ఇప్పుడు దీంట్లో ఓ రేంజ్‌లో ఉంటున్నారు. అయితే ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌ల‌లో పోస్టు చేసే ఫోటోలే ఇప్పుడు న‌గ్న‌చిత్రాలుగా మారుతున్నాయి.

అమ్మాయిలు స్టైలిష్‌గా ఫోటోలు దిగుతూ వాటిని ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో పోస్టు చేయ‌డం ఇప్పుడు స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. అయితే కొంద‌రు ఆక‌తాయిలు వీరినే టార్గెట్ చేస్తున్నారు. ఫోటోలు తీసుకొని వాటిని న‌గ్న‌చిత్రాలుగా మార్చి వారికే పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైం పోలీసులు ఎట్ట‌కేల‌కు ఈ కేసుల‌ను చేధించారు.

హైద‌రాబాద్‌లోని ఓ యువ‌తి విష‌యంలో ఇదే జ‌రిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ ఫోటోను కొంద‌రు ఆక‌తాయిలు తీసుకొని మార్ఫింగ్ చేసి ఆమెకే పంపించారు. డ‌బ్బులు డిమాండ్ చేసి ఇవ్వ‌క‌పోతే ఈ ఫోటోలు అంద‌రికీ పంపిస్తామ‌ని బెదిరించారు. ఈమె వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. కొందరిని డ‌బ్బులు అడగ‌డం, మ‌రికొంద‌రిని లైంగికంగా లొంగ‌దీసుకోవ‌డ‌మే వీరి ఆలోచ‌న‌గా ఉండేది.

అయితే కొంద‌రు యువ‌తులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో సైబ‌ర్ క్రైం పోలీసులు ఈ కేసును చేధించారు. క‌ర్నూలు జిల్లాకు చెందిన మ‌హ్మ‌ద్ అహ్మ‌ద్ అనే వ్య‌క్తిని ప‌ట్టుకున్నారు. ఓ ప్రైవేట్ సంస్థ‌లో ఉద్యోగం చేస్తున్న ఇత‌ను ఇదే ప‌నిలో ఉండేవాడు. ఇత‌ని వ‌ద్ద రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 50మందికిపైగా యువ‌తుల వివ‌రాలు గుర్తించారు.

ఇప్ప‌టికైనా యువ‌త సోష‌ల్ మీడియాలో లైక్‌ల కోసం విచ్చ‌ల‌విడిగా ఫోటోలు షేర్ చేయ‌డంపై ఆలోచించుకోవాలి. లేదంటే కొంద‌రు ఆక‌తాయిలే ఇదే ప‌నిగా పెట్టుకొని ఫోటోల‌ను న‌గ్న‌చిత్రాలుగా మార్చుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here