సీఎం జగన్ మరొక సంచలన నిర్ణయం..?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే నేడు కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు, నివారణ చర్యల నిమిత్తం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే ఈ నేపధ్యంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి కి 15 వేల రూపాయలు అంత్యక్రియల కోసం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం లో కరోనా వైరస్ భారిన పడి మృతి చెందిన వారి అంత్యక్రియల విషయం లో పలు అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇక పై కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించేందుకు సైతం ఆసుపత్రులు నిరాకరించ కూడదు అని, ఒక వేళ చికిత్స చేయని యెడల వారి అనుమతి రద్దు చేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.అయితే కంటన్మెంట్ జోన్ లలో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల కొరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక కరోనా వైరస్ పై ప్రజల నుండి సూచనలు, ఫిర్యాదులు తీసుకొనేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here