హైదరాబాద్ లో కుదేలైన ఐటీ రంగం ..వెక్కిరిస్తున్న అమీర్ పేట

హైదరాబాద్..! లక్షకోట్ల ఎగుమతులతో మూడుపువ్వులు ఆరుకాయలుగా ఉండే ఐటీ రంగం కుదిలైనట్లు తెలుస్తోంది. అమెరికా ప్రాజెక్ట్ ల పుణ్యమా అని పదిలక్షమందికి పైగా ఐటీ ఉద్యోగులు ఉపాది పొందుతున్నారు. అయితే ఈతరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకతో ఐటీ రంగం కుప్పకూలింది.  స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న ట్రంప్ మాటలతో హైదరాబాద్ కు వచ్చే ప్రాజెక్ట్ లు  తగ్గుముఖం పట్టాయి. కాస్ట్ కటింగ్ పేరుతో ఏంచేయాలో పాలుపోని ఐటీ యాజమాన్య సంస్థలు తమ ఉద్యోగుల్ని నిర్ధాక్షణ్యంగా తీసి పారేస్తుంది.
మరికొందరికి పింక్ స్లిప్ లిచ్చి సాగనంపుతుంది. ఉద్యోగస్థుల అవసరం తమ సంస్థకు ఉన్న వారిని తీసుకునేందుకు యాజమాన్యాలు మక్కువ చూపడంలేదు. దీంతో ఐటీ రంగంలో వందల కొద్ది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.  ఈ నేపథ్యంలో లగ్జరీస్ కు దూరంగా ఐటీ ఉద్యోగులు ఉండడంతో పాష్ ఏరియాల్లో ఉండే షాపింగ్ మాల్స్ అన్నీ వెలవెలబోతున్నాయి. వారంతపుసెలవుల్లో ఐటీ ఉద్యోగుల రాక తగ్గింది. దీంతో షాపింగ్ మాల్స్ లో కష్టమర్లులేక ఉద్యోగులు ఈగలు తోలుకుంటున్నారు. ఇప్పుడు  ఐటీ రంగం రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతుండడంతో పరోక్షంగా ఈ మాల్స్ వ్యాపారంపై ప్రభావం పడుతోందని ఆర్ధిక వేత్తలు వెల్లడిస్తున్నారు. వ్యాపారం సజావుగా లేకపోవడంతో మాల్స్ రెంట్ కట్టలేకపోతున్నామని ఓ యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ ఎఫెక్ట్ నుంచి భయటపడాలనే ఉద్దేశంతో ఐటీ, తదిరంగాల ఉద్యోగుల్ని ఆకట్టుకునేందుకు డిస్కౌంట్ ల మీద డిస్కౌంట్ లు ప్రకటిస్తున్నాయి. మాల్స్ నిర్వాహకులు అందిస్తోన్న ఖరీదైన బహుమతులు, విదేశీ ప్రయాణాలు వంటి ఆఫర్లుకు జనం కూడా మొగ్గుచూపుతున్నారు.  ఇదిలా ఉంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే పడి చచ్చే నిరుద్యోగులు..ఇప్పుడు ఐటీ అంటే ఆమడ దూరంగా పారిపోతున్నారు. ఆ సాఫ్ట్ వేర్ కోర్సు , ఈ సాఫ్ట్ వేర్ కోర్సులంటూ నిత్యం రద్దీగా ఉండే అమిర్ పేట ఖాళీ గా వెక్కిరిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here