అసాధార‌ణ‌మైన షాట్‌ని డూప్ లేకుండా అవ‌లీల‌గా చేసిన బాల‌కృష్ణ‌

భారీ మాస్  యాక్ష‌న్, క‌మ‌ర్షియ‌ల్‌ సినిమాల్లో రిస్కీ షాట్స్ ఉంటూనే ఉంటాయి. మ‌రింత రిస్క్ అనిపించిన‌ప్పుడు డూప్‌ల‌ను పెట్టి చిత్రీక‌రిస్తారు. కానీ ఓ అసాధార‌ణ‌మైన షాట్‌ను డూప్‌తో ప‌నిలేకుండా నంద‌మూరి బాల‌కృష్ణ అవ‌లీల‌గా చేసిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.  నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో  ఓ  చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని వి.ఆనంద‌ప్ర‌సాద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగ‌ల్‌లో జ‌రుగుతోంది.
ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ “పోర్చుగ‌ల్ రాజ‌ధాని లిస్బ‌న్ లో ఆదివారం ఓ ఛేజ్ సీన్‌ను తెర‌కెక్కించాం. ఇందులో కార్‌ని డ్రిఫ్టింగ్ ప‌ద్ధ‌తిలో 360 డిగ్రీలు తిప్పే షాట్‌ను చిత్రీక‌రించాం. ఆ షాట్‌ని బాల‌కృష్ణ‌గారు రెండు సార్లు డూప్ లేకుండా చేశారు. కారులో ఆయ‌న ప‌క్క సీట్లో కూర్చున్న శ్రియ అయితే షాక్ అయిపోయింది.  పోర్చుగ‌ల్ టెక్నీషియ‌న్లు, మ‌న చిత్ర యూనిట్ అంతా ఆనందంతో గ‌ట్టిగా క్లాప్స్ కొట్టారు.  అలా సినిమా మీద బాల‌కృష్ణ‌గారికి ఉన్న ప్యాష‌న్ మ‌రో సారి రుజువైంది. ఆయ‌న క‌మిట్‌మెంట్ చూసి అంద‌రం ఫిదా అయిపోయాం“ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here