ఏపీలో ప్లాస్టిక్ బియ్యం త‌యారీ..పోలీసుల అదుపులో నిందితులు

మొన్న ప్లాస్టిక్ కోడిగుడ్ల గోల..ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం లొల్లి. శ్రీశైలంలో ప్లాస్లిక్ బియ్యం అమ్ముతున్నారనే వార్తలు కలకలం రేపాయి. కొన్ని షాపుల్లో ప్లాస్టిక్ రైస్ త‌యారు చేసి అమ్ముతున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు  ఈ అనుమానాలు నిజమేనని అనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో ప్లాస్టిక్ రైస్ తో చేసిన బిర్యానీ, సిరిసిల్లలో ప్లాస్టిక్ బియ్యం అమ్మినట్లు వచ్చిన వార్తలు మరువముందే… శ్రీశైలంలోనూ ఇదే వార్త కలకలం రేపింది. మల్లికార్జున నగర్ కాంప్లెక్స్‌లోని భరత్ జనరల్ స్టోర్‌ నుంచి కొందరు స్థానికులు బియ్యం కొనుగోలు చేశారు. అయితే అన్నం వండే సమయంలో ప్లాస్టిక్ వాసన వచ్చింది. పైగా తింటుంటే ఎంతకీ నలగకపోతుండటంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
 రంగంలోకి దిగిన పోలీసులు వండిన అన్నాన్ని పరీక్షించారు. అన్నాన్ని ముద్దగా చేసి నేలపై విసిరితే బంతిలా ఎగిరి పడింది. అలాగే నిర్ణారణ కోసం బియ్యాన్ని కాల్చి చూశారు. భరత్ జనరల్ స్టోర్‌ లో పోలీసులు తనిఖీ చేయగా..స్టాకు అయిపోయినట్లు తేలింది. అనుమానిత బియ్యం.. ప్రకాశం జిల్లా మార్కపురం, నంద్యాల నుంచి వచ్చినట్లు దుకాణదారుడు తెలిపాడు.
పూర్తి వివరాలు రాబట్టడానికి బియ్యం సరఫరా చేసిన డీలర్‌ను పిలిపించి విచారణ జరపాలని కర్నూలు పోలీసులు నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here