చ‌ల‌ప‌తిరావు త‌మ్ముడు దొరికాడోచ్

న‌టుడు చ‌ల‌ప‌తిరావు త‌మ్ముడు దొరికిన‌ట్లు తెలుస్తోంది. రారండోయ్ వేడుక‌లో చ‌ల‌ప‌తిరావు మాట్లాడుతూ అమ్మాయిలో ప‌క్క‌లోకి ప‌నికొస్తారంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర‌దుమారం చెల‌రేగింది. ఆ విష‌యం మ‌రిచిపోక‌ముందే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్పీ చైర్మన్ బండారి బాస్కర్ కూడా చలపతిరావు బాటలో వివాదాస్ప వ్యాఖ్య‌లు చేశారు. ఒంటరిగా ఉండే మ‌హిళ‌ల‌కోసం టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఆస‌రా ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే పించ‌న్ల‌ను అందించేందుకు  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్డిఒ కార్యాలయానికి  మంత్రి జూపల్లి కృష్ణారావు, జడ్పి చైర్మన్ బండారి బాస్కర్ లు హాజరయ్యారు.
ఈ సందర్బంగా జడ్పి చైర్మన్ బండారి భాస్కర్ .. నడిగడ్డ  మహిళలే అందంగా ఉంటారని అనుకున్నా… కాని ఏటి అవతలి  మహిళలు కూడా చాలా అందంగా ఉంటారని తనలోని పైత్యాన్ని బయటపెట్టాడు. అంతేకాదు ఆ మ‌హిళ‌లు ఏపుగా క‌త్తిలా ఉంటార‌ని కామెంట్ చేశాడు. ఈ కామెంట్లను వారించాల్సిన స‌దరు మంత్రి న‌వ్వుతూ కూర్చొని ఉండ‌టం విశేషం .  ఒంటరి మహిళలను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్య‌లు ప్ర‌జాసంఘాలు మండిప‌డుతున్నాయి.త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here