ఫాన్స్ కోసం పవన్ ఎదో ఒకటి చెయ్యాల్సిందే!!

సరిగ్గా సినిమా విడుదలకి వారం ముందర తీరిక గా ప్రమోషన్ మొదలు పెట్టుకోవడం  , ఇలోగా చడీ చప్పుడూ లేకుండా సినిమా షూటింగ్ కానిచ్చేయ్యడం ఈ రోజుల్లో అయ్యే పనులు అసలు కాదు. క్రేజీ కాంబినేషన్ నుంచీ ఫస్ట్ లుక్ వరకూ మొదటి షెడ్యూల్ అవ్వకుండానే సగటు సినిమా ప్రేక్షకుడు సినిమా మీద హైప్ పెంచుకుంటున్న రోజులు ఇవి. బిజినెస్ పరంగా కూడా ఫస్ట్ లుక్ లాంటివి, టీజర్ లో , షూటింగ్ టైం వీడియో లు ఇవన్నీ చాలా కీలకంగా మారిపోయాయి.

బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ లే ఇదే పంథాలో నడుస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం మిన్నకున్నాడు. సైలెంట్ గా తన షూటింగ్ లో తాను బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్నా ఇప్పటి దాకా ఒక్కక ఫస్ట్ లుక్ కూడా వదలలేదు. అభిమానులు వాటి కోసం ఆవురావురుమని ఎదురు చూస్తున్నారు. కనీసం టైటిలైనా ప్రకటించి లోగో అయినా రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here