డైరెక్టర్ బాబీ మీద విపరీతమైన ప్రెజర్ పెడుతున్న ఎన్టీఆర్ :

గబ్బర్ సింగ్ తో హరీష్ శంకర్ సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టినా ఆ వెంటనే ఎన్టీఆర్ తో తీసిన రామయ్య వస్తావయ్య అట్టర్ ప్లాప్ గా మారిపోయింది. ఎన్టీఆర్ కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక ఫైల్యూర్ గా నిలిచిన ఈ చిత్రం కలక్షన్ ల దగ్గర కూడా పేలవం గా ఓడిపోయింది. సర్దార్ గబ్బర్ సింగ్ ని పవన్ కళ్యాణ్ తో తీసిన బాబీ కి జై లవ కుశ సినిమా అందించాడు ఎన్టీఆర్  ముందర సినిమా ప్లాప్ అయినా కూడా ఎన్టీఆర్ వెనక అడుగు వెయ్యకుండా ఈ చిత్రం తీస్తున్నాడు. గబ్బర్‌సింగ్‌కి హరీష్‌ కాన్ఫిడెన్స్‌ పీక్స్‌లో వుండడం వల్ల అతనేం చేసినా ఎన్టీఆర్‌ అడ్డు చెప్పలేదు.

కానీ సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఫ్లాప్‌ అవడంతో బాబీకి ఇది డూ ఆర్‌ డై సిట్యువేషన్‌. ప్లాప్ లో ఉన్నవాడు ఇంకా ఎక్కువ కష్టపడతాడు అనే కాన్సెప్ట్ తో ఎన్టీఆర్ ఈ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు అని అంటున్నారు. ఎన్టీఆర్ కి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం, వరసగా మూడు హిట్లు కొట్టిన తరవాత సినిమా అవ్వడం తో ఎన్టీఆర్ బాబీ మీద ఫుల్ ప్రెజర్ పెడుతున్నాడు అనీ తన రిస్క్ కి తగ్గట్టు రిజల్ట్ రావాల్సిందే అంటున్నాడు అనీ చెబుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here