దువ్వాడ జగన్నాథం ట్రైలర్ వాళ్లకి అస్సలు నచ్చలేదు :

దువ్వాడ జగన్నాథం ట్రైలర్ విషయం లో భిన్న వాదనలు వినపడుతున్నాయి. ఒక పక్క అల్లూ అర్జున్ ఫాన్స్ తమ హీరో ట్రైలర్ కుమ్మేసింది అంటూ ఉంటె ఇంకొందరు మాత్రం తుస్సు మనిపించింది అంటున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో అల్లూ అర్జున్ సినిమా అనగానే ట్రైలర్ మీద కూడా బోలెడంత హైప్ ఉంది. బన్నీ ని హరీష్ ఎలా చూపిస్తాడు అనేదాని మీద ఆసక్తికర చర్చ సాగింది. కానీ ట్రైలర్ చూసిన తరవాత చాలా మంది పెదవి విరిచారు. బ్రాహ్మణుడి గా కామెడీ ఎలా ఉంటుందా అని చూస్తే , ఆ పాత్రలో చెప్పిన డైలాగులు చాలా బలవంతంగా చెప్పినట్టు అనిపించాయి.
జెంటిల్మెన్ సినిమా కాన్సెప్ట్ లాగా చాలా చోట్ల అనిపించింది. డీజే లుక్ లో మాత్రం బన్నీ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. డైలాగులు కూడా చాల సాదా సీదాగా ఉన్నాయి ఒక్కటీ ఇంటరెస్టింగ్ గా ఎక్కేలా కనపడలేదు అని చెప్పాలి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here