2000 కోట్ల బాహుబలి .. ఒకే ఒక్క దేశం మిగిలి ఉంది :

ఆరవ వారం లోకి వచ్చేసినా కూడా బాహుబలి సినిమా ఇంకా చరిత్ర కాలేదు… అంటే జనం ఇంకా ఈ సినిమాని మర్చిపోలేదు అని అర్ధం. స్టడీ గా సరైన వసూళ్లు లాగేస్తోంది ఈ చిత్రమా. నాలుగు వారాల తరవాత షేర్ లు రావని ట్రేడ్ జనాలు అంచనా వేసారు కానీ ఇంకా లాభాల పంట పర్లేదు అన్నట్టే పండిస్తోంది ఈ చిత్రం. పదిహేడు వందల కోట్ల గ్రాస్ కలక్షన్ ల దగ్గర ఈ చిత్రం ఫుల్ రన్ ముగుస్తుంది అని అంటున్నారు ఇది ఇండియా  + వరల్డ్ వితౌట్ చైనా వరకూ కలక్షన్.

ఆ లెక్కలో రెండు వేల కోట్ల గ్రాస్ తో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపే ఛాన్స్ కనిపిస్తోంది ఈ సినిమాకి. చైనా లో ఇంకా విడుదల అవ్వలేదు కాబట్టి అక్కడ కనీసం మూడొందల కోట్లైనా లాగేస్తారు అందులో డౌట్ లేదు. దంగల్ అక్కడ పదకొండు వందల కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి ఇంకా మంచి వసూళ్లతో రన్‌ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here