పవన్ కళ్యాణ్ లాంటి వేషాలు వేస్తున్న హీరోయిన్ ..

ఒక డైరెక్టర్ తో హీరో లేదా హీరోయిన్ సినిమా కి కమిట్ అయిన టైం లో ఆ సినిమా డైరెక్షన్ బాధ్యతలు వారికే పూర్తిగా వదిలెయ్యాలి .. అలా చెయ్యకుండా అయిన దానికీ కాని దానికీ వేలు పెడుతూ ఉంటారు కొందరు తారలు. ఈ లైన్ చదువుతూ ఉన్న టైం లోనే మీకు పవన్ కళ్యాణ్ గుర్తొచ్చి ఉంటాడు. పవన్ కళ్యాణ్ లాంటి మనస్తత్వం ఉన్న మరొక హీరోయిన్ బాలీవుడ్ లో రాజ్యం ఏలుతోంది. క్వీన్ లాంటి సినిమాలతో మన అందరికీ తెలిసిన కంగన రనౌత్ ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ మణికర్ణిక లో వేలు పెడుతోంది అని అంటున్నారు.

బాలీవుడ్ లో ఈ వార్త కోడై కూస్తోంది. దర్సకత్వం వైపు అడుగు పెట్టాలి అని చూస్తున్న కంగన చాలా విషయాల్లో డైరెక్టర్ క్రిష్ కి అడ్డం పడుతోంది అంటున్నారు. క్వీన్ సినిమా టైం నుంచే ఆమెకి ఈ యాటిట్యూడ్ ఉన్నా ఈ మధ్య కాలం లో ఆమె క్రిష్ సినిమాకి తన విశ్వరూపం చూపిస్తోంది అని టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here