మొబైల్ వ్యాలెట్ ఉంటె తప్పదు ఇవన్నీ

మొబైల్ వ్యాలెట్ కంపెనీలకు ఆర్ బీఐ కాస్తంత ఊరటనిచ్చింది. డిసెంబర్ 31లోపు ప్రతీ వాలెట్ యూజర్ నుంచి వారి గుర్తింపు వివరాలను (కేవైసీ) తీసుకోవడం తప్పనిసరిగా కాగా, కంపెనీల విన్నపం మేరకు ఈ గడువును తాజాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. ప్రీపెయిడ్ పేమెంట్ వ్యవస్థలను సంస్కరించే చర్యల్లో భాగంగా కేవైసీ నిబంధనలు అమలు చేయాలని అక్టోబర్ 11న ఆర్ బీఐ ఆదేశించింది.

ఆధార్ తదితర ప్రభుత్వ గుర్తింపు వివరాలు తీసుకోవాలని కోరింది. దీంతో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని, గడువు పొడిగించాలని కంపెనీలు అభ్యర్థించాయి. ఎట్టకేలకు ఆర్ బీఐ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. 2016-17లో సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం వ్యాలెట్ సంస్థల ద్వారా 160 కోట్ల లావాదేవీలు జరగ్గా, వీటి విలువ రూ.53,200 కోట్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here