కన్న కొడుకునే చంపేసిన తల్లి.. ఆపై తమ కుమారుడు అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు

నవమాసాలు మోసి కనిపెంచి పోషించాల్సిన కన్నతల్లి తన కుమారుడిని కడతేర్చింది.రోజులు మారే కొద్దీ సమాజంలో ప్రేమాభిమానాలు అనురాగాలు తగ్గుతున్నాయని స్పష్టంగా అర్ధం అవుతుంది ఇటువంటి ఘటనలు చూసినప్పుడు. వివరాల్లోకి వెళితే కేరళ రాష్ట్రంలో కొల్లం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక తల్లి తన కొడుకుని నిర్దాక్షిణ్యంగా హత్యచేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి కాల్చేచేసింది. అసలు పూర్తి వివరాల్లోకి వెళితే  జితూ జాబ్ అనే 14 ఏళ్ల‌ త‌మ కుమారుడు సోమవారం రాత్రి అదృశ్యమయ్యాడని అత‌డి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు బాలుడు కోసం అన్వేషించే ప్రాసెస్ లో మి కుటుంబానికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అని తల్లిదండ్రులను ప్రశ్నించగా మాకు శత్రువులు ఎవరు లేరని పోలీసులకు తల్లిదండ్రులు చెప్పారు. ఈ క్రమంలో బాలుడి కోసం అన్వేషించగా, వాళ్లింటి సమీపంలోనే ఓ మృతదేహం ముక్కలు ముక్కలుగా పడి, కాలిపోయి ఉండటాన్ని గుర్తించారు. చివరికి ఆ మృతదేహం జితూదేన‌ని నిర్ధారించారు.దీంతో కుటుంబసభ్యులే ఈ హ‌త్య చేసి ఉండొచ్చ‌ని పోలీసులు భావించారు.బాలుడి తల్లి చేతికి కాలిన గాయం గుర్తించారు.దీంతో పోలీసులు ఆమెను విచారణ చేయగా  ఆమె నేరాన్ని ఒప్పుకుంది. అయితే, కొడుకుని ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయాన్ని మాత్రం ఆమె చెప్పడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here