కేవలం 160 రూపాయలకే 5.25 కోట్ల రూపాయల భవంతి

అదేంటి రూ.160 కి 5.25కోట్ల భవంతి ఎలా వస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా..? అక్షరాల రూ.5.25కోట్ల భవంతిని 160కి సొంతం చేసుకోవచ్చు. దీనిలో కండిషన్ లో ఏమీలేవు. మీ అదృష్టం బాగుంటే కోట్ల భవంతి రూపాయల్లో సొంతం చేసుకోవచ్చు. కేవలం మీరు చేయాల్సిందల్లా లాటరీ తీయడమే. ఈ లాటరీ అదృష్టం ఎవరికి వరిస్తుందో వాళ్లు సొంతం చేసుకోవచ్చు. బ్రిటన్ కు చెందిన డన్ స్ట్‌న్ లోవే అనే వ్యక్తి 2011లో 3.50కోట్లతో ఆరు బెడ్ రూంల భవంతిని కొనుగోలు చేశారు. దాన్ని రుణం తీసుకొని మళ్లీ రీమోడలింగ్ చేయించాడు.

అయితే తీసుకున్న రుణం తీర్చులేక భవంతిని 8.45 అమ్మాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించి తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇలా ధరల్ని తగ్గిస్తూ భవంతిని  మూడు సార్లు అమ్మడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరి ప్రయత్నంగా తన అందమైన భవంతిని లాటరీ పద్ధతిలో విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. కేవలం 2 పౌండ్ల (160 రూపాయల) కే సొంతచేసుకోవడంటూ సంచలన ప్రకటనచేశాడు. దేశాలతో సంబంధం లేకుండా ఏ దేశం వారైనా లాటరీ తీయోచ్చని అన్నాడు.

దీంతో స్వదేశం నుంచి కాక విదేశాలకు చెందిన  చాలామంది ఔత్సాహికులు లాటరీ తీశారు.  ఇప్పటి వరకు ఆయన 1.20 లక్షల ( వీటి విలువ 96 లక్షల రూపాయలు) లాటరీ టిక్కెట్లను విక్రయించారు. కాగా ఆగస్ట్ లో ఈ లాటరీ విజేత ఎవరో నిర్ణయిస్తామని ..అప్పటిలోగా 5లక్షల లాటరీ టికెట్లను టార్గెట్ పెట్టుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here