ఏయ్.. ఎవరూ నవ్వేది.. అయిపోతారు జాగ్రత్త!

ఆయనంతే. జయంతిని వర్థంతిని చేసేస్తారు. సొంత పార్టీపైనే నోరు జారతారు. యువ నాయకుడి నుంచి మంత్రిగా ఎదిగినా కూడా.. వేదికలపై ఎలా మాట్లాడాలన్నదీ తెలుసుకోరు. అయినా.. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సుపుత్రుడు కాబట్టి.. ఏమన్నా వినాల్సిందే. ఎలా మాట్లాడినా భరించాల్సిందే. ఎంతైనా.. కాబోయే ముఖ్యమంత్రిగా మరి. అందుకే.. ఇన్నాళ్లూ పార్టీలో పెత్తనం చలాయించిన సమర్థ నాయకుడు కాబట్టే.. ఇప్పుడు మంత్రిగా ప్రమోట్ అయ్యారు. అయినా.. ఆయనకేం మాట్లాడరాదు. అయినా మనం భరించాల్సిందే.

రాజకీయాల్లో ఉంటూ.. మంత్రి అయి ఉండీ.. జయంతికీ వర్థంతికీ తేడా తెలియని వ్యక్తి.. కీలక నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో ఎలా వ్యవహరిస్తారని అనుకుంటున్నారా? అయితే మీ ఖర్మ. అలాగే అనుకోండి. ఎందుకంటే.. ఎంత మంత్రయినా.. తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి.. కీలక వ్యవహారాలన్నీ అలా.. అలా.. చక్కబడిపోతుంటాయి.

ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టే.. ఆయన అంతలా.. నిర్లక్ష్యంగా మాట్లాడగలుగుతారు. అంత మాత్రాన మీరు నవ్వేస్తారా.. పగలబడి నవ్వేస్తారా…? టీడీపీ నేతలు కూడా పగలబడి నవ్వుతున్నారు.. మేం నవ్వితే ఏంటంట? అని కూడా అడుగుతారా? నెవ్వర్. అలా అడగడానికే వీల్లేదు. అలా చేస్తే.. అది ఎంతవరకైనా దారి తీయొచ్చు.

ఇంక.. టీడీపీ నేతలైతే.. మరీ జాగ్రత్త. మీకు పదవి పోవచ్చు. పార్టీ సభ్యత్వమే పోవచ్చు. ఎందుకంటే.. ఆ మధ్య.. ఓ చానల్ లో.. ఓ సీనియర్ జర్నలిస్టు.. మన చినబాబు ప్రతాపానికే.. పెద్ద పోస్టు నుంచి పక్కకు తప్పుకుని.. వేరే చానల్లో చేరాల్సి వచ్చింది. పార్టీకి సంబంధం లేని వ్యక్తికే ఇలా జరిగితే.. ఇంక టీడీపీ నేతలకు దిక్కెవరు? ఈ విషయం కాస్త ఆలోచించి జాగ్రత్తగా అడుగులేయండి.

అందుకే.. చినబాబే కదా అని తేలిగ్గా చూడకండి. ఆయనకేం మాట్లాడరాకపోయినా.. ఆయనకేం తెలియకపోయినా.. ఆఖరికి జయంతిని వర్థంతిని చేసినా సరే.. ఆయన మన మంత్రిగారు.

ముఖ్యమంత్రిగారి సుపుత్రులు. అందుకే.. జాగ్రత్తగా ఉండండి. టీడీపీ నేతలయితే.. ఇంకా జాగ్రత్తగా ఉండండి. లేదంటే.. మీ సీటుకే ఎసరు వస్తుంది జాగ్రత్త.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here