ప్రభాస్ కోసం ఎగబడుతున్న ముంబై అమ్మయిలు .. ఆపడం సెక్యూరిటీ తరం కాదు

ఒక తెలుగు సినిమా హిందీ అనువాదం అంటే బాలీవుడ్ మీడియా పెద్దగా పట్టించుకోదు కానీ బాహుబలి తెలుగు అనువాదం కి నేషనల్ వైడ్ లో పిచ్చ క్రేజ్ ఉండనే ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఏ క్రూ తో కాసేపు మాట్లాడినా బాలీవుడ్ వారు అదొక పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో హీరో, విలన్‌ పాత్రలు చేసిన ప్రభాస్‌, రాణాల కోసమయితే అమ్మాయిల తాకిడి ఎక్కువైపోతోంది. ఎక్కడ ప్రెస్ మీట్ ఉంటె అక్కడ అమ్మాయిలు విపరీతంగా వచ్చేసి ప్రభాస్ కోసం ఎగబడుతున్నారట.

ఎలాగైనా బాహుబలి చేతిని టచ్‌ చేయాలి, ఏం చేసయినా భల్లాలదేవునితో సెల్ఫీ దిగాలంటూ ఎగబడిపోతున్నారట. ఇందుకోసం ప్రత్యేకంగా బౌన్సర్ లని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేటు సెక్యూరిటీ ఎంత పెట్టినా అమ్మాయిలని ఆపడం అవడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here