60 వేలు దాటిన కరోనా కేసులు.. రోజుకు 95 వేల టెస్టులు చేసే స్థితికి భారత్

భారత్‌లో జనవరి 30న తొలి కేసు నమోదు కాగా.. మార్చి నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో 60 వేలకుపైగా కోవిడ్ కేసులను గుర్తించారు. ఇప్పటి వరకూ మన దేశంలో 332 ప్రభుత్వ, 121 ప్రయివేట్ ల్యాబొరేటరీల్లో 15 లక్షలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. ప్రస్తుతం మన దేశం రోజుకు 95 వేల పరీక్షలు చేయగలిగే స్థితికి చేరుకుందన్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల విషయమై సంబంధిత రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అసోం, త్రిపురల్లో మాత్రమ కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలన్నీ గ్రీన్ జోన్లో ఉన్నాయి. ఈ విషయమై హర్షవర్దన్ ఆనందం వ్యక్తం చేశారు. ఆరెంజ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మలచడంపై శ్రద్ధ వహిద్దామని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజలు పొగాకు నమలడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం లాంటి పనులు చేయకుండా చూడాలని హర్షవర్దన్ సూచించారు. పొగాకు నమలడం.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధాన్ని రాష్ట్రాలను ఆయన ప్రశంసించారు. అంతర్జాతీయ సరిహద్దులు ఉన్న రాష్ట్రాలు మరింత జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. విదేశాల నుంచి వచ్చే వారు, తిరిగొస్తున్న వలస కూలీలను క్వారంటైన్లో ఉంచే విషయమై కేంద్రం మార్గదర్శకాలను పాటించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here