16ఏళ్ల బాలికతో ప్రేమాయణం.. ఏకాంతంగా గడిపేందుకు ఆమె ఇంటికెళ్లి

ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికే వెళ్లిన ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా పొల్లాచ్చిలో జరిగింది. చిన్న పాళయంకు చెందిన రాధాకృష్ణన్‌ కుమారుడు గౌతమ్‌ అదే ప్రాంతానికి చెందిన 16ఏళ్ల బాలికతో ప్రేమలో పడ్డాడు. ఆమెతో తరుచూ సినిమాలు, షికార్లకు తిరిగేవాడు. లాక్‌డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా ప్రియురాలిని కలుసుకోలేక ఆవేదన చెందాడు. ఆమెతో రోజూ ఛాటింగ్ చేస్తూ విరహ వేదన అనుభవించేవాడు.

Also Read:

శనివారం ప్రియుడికి మెసేజ్‌ చేసిన బాలిక తన ఇంట్లో ఎవరూ లేరని, వస్తే ముచ్చట్లు చెప్పుకుందామని చెప్పింది. దీంతో గుట్టుగా ఆమె ఇంటికి వెళ్లిన గౌతమ్ ప్రియురాలితో ఏకాంతంగా గడిపాడు. సాయంత్రం సమయంలో బాలిక తల్లి ఇంట్లోకి వచ్చిన సమయంలో గదిలో మాటలు వినిపించడంతో షాకైంది. వెంటనే తన భర్త, కొడుక్కి ఫోన్ చేసి పిలిపించింది. వారు ఇంటికి వచ్చీ రావడంతోనే క్రికెట్ బ్యాట్‌తో గౌతమ్‌ని తీవ్రంగా కొట్టారు.

Also Read:

అతడికి తీవ్ర రక్తస్రావం కావడంతో భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో చొరబడి దొంగతనం చేస్తుంటే కొట్టామని వారు కట్టుకథలు చెప్పారు. పోలీసులు అతడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గౌతమ్ ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు బాలికను ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి, సోదరులు, మేనమామపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here