సుప్రీం చరిత్రలో తొలిసారి.. వాదనలు విననున్న సింగిల్ జడ్జి బెంచ్

సుప్రీం చరిత్రలో తొలిసారిగా సింగిల్ జడ్జి బెంచ్‌తో కేసుల వాదనలు విననుంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా చాలా కేసులు పెండింగ్‌ పడుతుండటంతో.. కేసుల భారాన్ని తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. బెంచ్‌లో కనీసం ఇద్దరు జడ్జిలు ఉంటారు. కానీ ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్‌కు సంబంధించి సింగిల్ జడ్జి బెంచ్ వాదనలు విననుంది. బెయిల్ పిటిషన్లు, పిటిషన్లను బదిలీ చేయడం లాంటి వాదనలను సింగిల్ జడ్జి బెంచ్ వినేలా గత ఏడాది సెప్టెంబర్లో సుప్రీం సవరణ చేసింది.

న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత ఏడాది జులై నాటికి కోర్టులో 11.5 లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా సుప్రీం అత్యవసర కేసులకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలను వింటోంది. అత్యవసర కేసులకు సంబంధించి ఈ-ఫైలింగ్ విధానంలో దరఖాస్తు చేసుకోవడం ఉత్తమమని సుప్రీం సెక్రటరీ జనరల్ పేరిట సర్క్యులర్ జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here