లేబర్ చట్టాల్లో కీలక మార్పులు చేసిన మూడు రాష్ట్రాలు.. అదే బాటలో మరిన్ని!

పురాతన లేబర్ చట్టాల్లోని కఠిన నిబంధనలను ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాలు సడలింపులను ఇచ్చాయి. దీంతో ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభానికి, దీర్ఘకాలంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, మార్కెట్ సౌలభ్యాన్ని సాధించడం ద్వారా ఉద్యోగాలు సృష్టించడానికి అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై కార్మిక సంఘాలు మాత్రం మండిపడుతున్నాయి. కార్మికుల హక్కులకు భంగం కలుగుతుందని హెచ్చరిస్తున్నాయి.

చట్టాల్లో సడలింపు వల్ల అదనంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కార్మికులు మరో నాలుగు గంటలు, వారానికి 72 గంటలు ఓవర్ టైం పెంచడానికి వీలు కలుగుతుంది. కొత్త యూనిట్లలో థర్డ్‌ పార్టీ తనిఖీలను అనుమతించడం, పని గంటలను మార్చడానికి యాజమాన్యానికి అనుమతి లభిస్తుంది. తప్పనిసరిగా రిజిస్టర్ల నిర్వహణకు మినహాయింపులు, ఉద్యోగ భద్రతకు కార్మిక సంఘాలు అవసరమన్న నిబంధన నిలిపివేయడం లాంటివి అమల్లోకి రానున్నాయి.

ప్రస్తుత తరుణంలో కొత్త ఉద్యోగాలను తక్షణమే సృష్టించాల్సిన అవసరం ఉంది.. అంటే కార్మికులకు నియమించుకోవడం.. కనీస వేతనాలు, వారి ఉద్యోగ భద్రతకు భరోసా కల్పించడం అని కేంద్ర కార్మిక శాఖ మాజీ కార్యదర్శి శంకర్ అగర్వాల్ అన్నారు. కార్మికుల హక్కుల గురించి మాట్లాడటం అర్ధరహితమని, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు.

కాగా, , మధ్యప్రదేశ్, గుజరాత్ బాటలోనే హర్యానా కూడా పయనించనుంది. ఇప్పటికే కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఆటంకాలుగా ఉన్న నిబంధనలను తొలగించేందుకు సిద్ధమయ్యింది. ‘రాబోయే రెండు త్రైమాసికాలకు దేశంలోని ప్రతి రాష్ట్రం.. యూపీ, ఎంపీల మాదిరిగా ముందడుగు వేయాలి… అత్యవసర సమయాల్లో అత్యవసర చర్యలు తీసుకోవాల్సని అవసరం ఉంది.. సాధారణ స్థితిపై దాదాపు 440 కేంద్ర, రాష్ట్ర చట్టాలపై వచ్చిన 27,000 వినతులను పరిశీలించడానికి కార్మిక కమిషన్‌ను నియమించాల్సిన అవసరం ఉందని తాము నమ్ముతున్నాం. వేగంగా ఆర్థిక పునరుద్ధరణకు ఒకే లేబర్ కోడ్ ఉండాలి’ అని టీమ్‌లీజ్ సహ-వ్యవస్థాపకుడు, వైస్ ప్రెసిడెండ్ రీతూపూర్ణ చక్రవర్తి వ్యాఖ్యానించారు. లేబర్ కోడ్ వల్ల ఆర్ధిక వ్యవస్థ వేగంగా పుంజుకుని, ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు.

గుజరాత్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ వంటి మరిన్ని రాష్ట్రాలు ఇలాంటి చర్యలకు ప్రణాళికలు వేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ట్రేడ్ యూనియన్లు తెలిపాయి. ‘కార్మిక చట్టాలను నిలిపివేయడం ఆర్థిక కార్యకలాపాలను పునః ప్రారంభించడంలో ఎలా సహాయపడుతుందో తమకు వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాస్తామని’ బీజేపీ అనుబంధ విభాగం భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి విర్జేశ్ ఉపాధ్యాయ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here