మహారాష్ట్రలో కరోనాతో ఒక్క రోజే 54 మంది మృతి.. 25 వేలు దాటిన కేసులు

మ హారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 25 వేల మార్క్ దాటగా.. మరణాల సంఖ్య 1000కి చేరువైంది. బుధవారం (మే 13) ఒక్క రోజే రాష్ట్రంలో 1,495 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఇప్పటివరకు ఇవే అత్యధిక కేసులు. తాజాగా నమోదైన కేసులతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,922కు ఎగబాకింది. ఒక్క ముంబైలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15 వేల మార్క్‌ను దాటింది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరు పొందిన ధారావిలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది.

కరోనా కారణంగా మహారాష్ట్రలో నేడు ఒక్క రోజే 54 మంది మృతి చెందారు. ముంబై నగరంలోనే 40 మరణాలు సంభవించాయి. కొవిడ్‌-19 కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 975 మంది మరణించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో గత ఆరు రోజులుగా 1000కి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయంటే.. అక్కడ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

మహారాష్ట్రంలో 422 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిన వారి సంఖ్య 5,547కు చేరుకుంది. ముంబై నగరంలో ఇప్పటికవరకు 2.5 లక్షల నమూనాలను పరీక్షించారు. 3 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ముంబై తర్వాత పుణేలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు అక్కడ 2800 కేసులు నమోదయ్యాయి.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here