పాక్ క్రికెటర్ ఉమ‌ర్ అక్మ‌ల్‌పై మూడేళ్ల నిషేధం

వివాదస్ప‌ద క్రికెట‌ర్ ఉమ‌ర్ అక్మ‌ల్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వేటు వేసింది. పీసీబీ యాంటి కర‌ప్ష‌న్ కోడ్‌లోని నిబంధ‌న 2.4.4ను ఉల్లంఘించినందుకుగాను మూడేళ్ల‌పాటు నిషేధం విధించింది. నిజానికి పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌) ఐదో ఎడిష‌న్ ప్రారంభానికి ఒక్క‌రోజు ముందు అవినీతి ఆరోప‌ణ‌ల‌తో ఉమ‌ర్‌పై పీసీబీ వేటు వేసింది. తాజాగా ఆ ఘ‌ట‌న‌పై జ‌స్టిస్ ఫ‌జ‌ల్ ఈ మిరాన్ చౌహాన్ నేతృత్వంలోని క్ర‌మ‌శిక్ష‌ణా ప్యానెల్ విచార‌ణ చేసింది. తాజాగా ఈ ప్యానెల్ అన్ని ఫార్మాట్ల నుంచి అక్మ‌ల్‌ను మూడేళ్ల‌పాటు నిషేధిస్తూ చ‌ర్య తీసుకుంది.

Must Read:

పాక్ వైట్‌బాల్ క్రికెట్ స్పెష‌లిస్టు అయిన 29 ఏళ్ల ఉమ‌ర్‌.. గ‌తేడాది చివ‌రిసారిగా పాక్ త‌ర‌పున ఆడాడు. 2009లో పాక్ త‌ర‌పున అరంగేట్రం చేసిన ఉమ‌ర్‌.. 11 ఏళ్ల త‌న కెరీర్‌లో 16 టెస్టులు, 121 వ‌న్డేలు, 84 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి మూడు సెంచ‌రీలు చేశాడు. చివ‌రిసారిగా గ‌త అక్టోబ‌ర్‌లో శ్రీలంక‌తో జ‌రిగిన టీ20లో త‌ను ఆడాడు.

Must Read:

మ‌రోవైపు వివాద‌స్ప‌ద క్రికెట‌ర్ల‌పై పీసీబీ అవినీతి నిరోధ‌క విభాగం ఎప్ప‌టి నుంచో నిఘా ఉంచుతోంది. పలువురు క్రికెట‌ర్ల ఫోన్ల‌ను కూడా ట్యాప్ చేస్తోంది. గ‌తంలో ఉమ‌ర్‌ను మూడు, నాలుగు రోజులపాటు ప‌రీక్షించిన త‌ర్వాతే అత‌నిపై వేటు వేయాల‌ని నిర్ణ‌యించింది. ఇటీవ‌ల బుకీని క‌లిసిన విష‌యాన్ని దాచి పెట్ట‌డంతో ఉమర్‌ను ఇక ఉపేక్షించకుండా, అత‌డిపై చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇక క్రికెట‌ర్లు ఇలా చెడ్డ దారులు తొక్క‌డానికి బోర్డు వైఫ‌ల్య‌మే కార‌ణమ‌ని మాజీ క్రికెట‌ర్లు విమ‌ర్శిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here