క‌రోనా గుడ్‌న్యూస్‌: ఇండియాలో 20 ఏళ్ల క‌నిష్టానికి గాలి కాలుష్యం.. నాసా

ప్రమాద‌క‌ర క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌మంతా వ‌ణుకుతున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వేళ అన్ని బ్యాడ్‌న్యూస్‌లే విన్పిస్తున్న‌వేళ‌.. తాజాగా శాస్త్ర‌వేత్త‌లు ఒక మంచి విష‌యాన్ని చెప్పారు. క‌రోనాను ఎదుర్కొనేందుకు దేశ‌మంతా లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌న‌దేశంలో గాలి కాలుష్యం చాలా త‌గ్గింద‌ని ప్ర‌ముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ- నేష‌న‌ల్ ఏరోనాట్సిక్‌, స్పేస్ అడ్మినిస్ట్రేష‌న్ (నాసా) శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా ఉత్త‌ర భార‌తంలోని గంగా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో గాలి కాలుష్యం 20 ఏళ్ల క‌నిష్టానికి త‌గ్గిన‌ట్లు తెలిపారు.

Must Read:

లాక్‌డౌన్ కాలంలో భార‌త్ వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణంలో చాలా మార్పులు వ‌చ్చాయని నాసా శాస్త్ర‌వేత ప‌వ‌న్ గుప్తా తెలిపారు. ఇండో-గాంగెటిక్ ప్రాంతంలో గాలిలో ధూళి కణాలు చాలా త‌క్కువ‌గా న‌మోదైన‌ట్లు పేర్కొన్నారు. నాసా ఉప‌గ్ర‌హాలు తాజాగా తీసిన ఫొటోల్లో ఈ విష‌యాలు వెల్ల‌డైన‌ట్లు స్ప‌ష్ట‌త‌నిచ్చారు.

Must Read:

2016 నుంచి నాలుగేళ్ల‌పాటు శాటిలైల్ ఫొటోలు తీస్తున్నామ‌ని, కాలుష్యం ఇంత‌ త‌క్కువ స్థాయిలో న‌మోద‌వ‌డం ఇదే తొలిసారని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు. నిజానికి లాక్‌డౌన్ ప్రారంభమైన తొలి వారంలోనే ఏరోసాల్ క్షీణ‌త ప్రారంభ‌మైంద‌ని తెలిపారు. దీనికి వ‌ర్షం కార‌ణంగా భావించామ‌ని, అయితే వ‌ర్షం ఆగిపోయిన త‌ర్వాత కూడా ఏరోసాల్ లెవల్స్‌లో వృద్ధి క‌న్పించ‌లేద‌ని పేర్కొన్నారు. క‌రోనాను ఎదుర్కొనేందుకు మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వ‌ర‌కు తొలి విడ‌త లాక్‌డౌన్ విధించారు. అనంత‌రం ఈనెల 14 నుంచి మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను మ‌రోసారి పొడిగించిన సంగ‌తి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here