కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: వైరస్ వ్యాప్తి తగ్గుముఖం.. కేసుల రెట్టింపునకు 11.3 రోజులు

⍟ దేశంలో వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. కొత్త కేసులు వందల్లో నమోదు అవుతున్నాయి. లాక్‌డౌన్ వల్ల వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం తక్కువగానే ఉందని కేంద్రం తెలిపింది. దేశంలో వైరస్ వెలుగుచూసిన తొలినాళ్లలో పాజిటివ్ కేసులు రెట్టింపు కావడానికి 3.5 రోజుల పడితే.. ప్రస్తుతం అది 11.6 రోజులగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

⍟ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని అన్ని దేశాలూ విలవిలలాడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ విజృంభణ ఆగడం లేదు. మహమ్మారి కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 61 వేలు దాటింది. రెండు దశాబ్దాలపాటు సాగిన వియత్నాం యుద్ధంలో 58,200 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా.. అంతకంటే ఎక్కువ మంది అమెరికన్లను ప్రస్తుతం కరోనా అతి తక్కువ కాలంలో చనిపోవడం గమనార్హం.

⍟ గడచిన 24 గంటల్లో కరోనా మరణాలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 74 మంది కరోనా వైరస్‌తో మృత్యువాతపడ్డారు. దేశంలో వైరస్ మరణాలు 24 గంటల్లో ఇంతపెద్ద సంఖ్యలో నమోదు కావడం ఇదే తొలిసారి. అత్యధికంగా మహారాష్ట్రలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా వైరస్ మరణాల సంఖ్య 1080కి చేరింది. ముందు రోజుతో పోల్చితే పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదుకావడం కొంత సానుకూలంశం.

⍟ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. బుధవారం నాడు 73 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సఖ్య 1332కు చేరింది. తాజాగా ఏపీ రాజ్‌భవన్‌లో మరో రెండు కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

⍟ ఏపీలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య కార్మకులతో పాటు.. జగన్ సర్కార్ కొత్తగా నియమించిన వార్డు వాలంటీర్లు కూడా కరోనా విధుల్లో పాల్గొంటున్నారు. ఇంటింటికి తిరిగి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు.

⍟ దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ మే 3న ముగియనున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన చేసింది. మే 4 నుంచి చాలా జిల్లాలకు లాక్‌డౌన్ నిబంధనల నుంచి గణనీయమైన రీతిలో వెసులుబాటు కల్పించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే వెలువరించనున్నారు.

⍟ ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పలు జిల్లాల్లో కూడా కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ప్రముఖ నగరాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇదే విషయాన్ని కలెక్టర్ ఇంతియాజ్ స్వయంగా తెలిపారు.

⍟ తెలంగాణ రాష్ట్రంలో మరో 7 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరింది. బుధవారం (ఏప్రిల్ 29) మరో 35 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 409కి చేరుకుంది.

⍟ కరోనా కట్టడికి విధించిన లాక్‌ డౌన్‌‌తో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో వలస కార్మికులకు, పేద వారికి కావాల్సిన నిత్యావసరాలను, భోజనాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉంటే సినీ సెలబ్రిటీల విషయంలో కొన్ని రకాల ఛాలెంజ్‌ల ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతోంది.

⍟ కరోనా బారిన పడి అనేకమంది ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా ఈ ప్రాణాంతక వైరస్ సోకి సీర్పీఎఫ్ జవాన్ మృతి చెందారు. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ ఎస్ఐ దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కరోనా సోకి మరణించారు.

⍟ ఉష్ణోగ్రత పెరిగితే

వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది. రోజువారీ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుదల, కరోనా వైరస్ వ్యాప్తికి మధ్య 85 శాతం చాలా బలమైన సహసంబంధం ఉదని నాగ్‌పూర్‌లోని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరి) నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

⍟ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సూచనలతోనే

(కోవిడ్ 19) పరీక్షలు చేసేందుకు చైనా కిట్లను దిగుమతి చేసుకోలేదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌‌రెడ్డి వెల్లడించారు. చైనాను కాదని, దక్షిణ కొరియా నుంచి మాత్రమే కరోనా టెస్ట్‌ కిట్లను దిగుమతి చేసుకున్నామని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here