అర్ధరాత్రి పొలానికెళ్లిన టమాటా రైతు.. పాముకాటుతో మృతి.. పుంగనూరులో విషాదం

లాక్‌డౌన్‌తో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైనా అందరి కడుపులు నింపేందుకు రైతన్న మాత్రం పొలం పనులు చేస్తూనే ఉన్నాడు. నిత్యవసరాలైన కూరగాయలు పండిస్తున్న రైతులు రాత్రీపగలు తేడా లేకుండా పొలం పనుల్లో నిమగ్నమైన వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. బోరు బావి మోటారు ఆపేందుకని చిమ్మచీకట్లో పొలం వెళ్లిన రైతు పాముకాటుకు గురై ప్రాణాలొదిలాడు. అత్యంత విషాదం నింపిన ఈ ఘటన జిల్లా నియోజకవర్గంలో జరిగింది.

చౌడేపల్లి మండలం మాదంవారిపల్లెకు చెందిన రైతు గంగిరెడ్డి(42) పాముకాటుకు గురై దుర్మరణం చెందాడు. ప్రస్తుతం టమాటా పంట సాగు చేస్తున్న గంగిరెడ్డి బోరు బావి మోటారు ఆపేందుకు అర్ధరాత్రి 12 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లాడు. ఉదయం 5 గంటలకు కరెంట్ వస్తుందని.. అప్పుడు మళ్లీ మోటారు వేసుకోవచ్చని భావించి ఆఫ్ చేసేందుకు ఆ సమయంలో వెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read:

పొలంలో వెళ్తుండగా గంగిరెడ్డిని పాము కాటేసింది. ఒక్కసారిగా భయాందోళనకు గురైన గంగిరెడ్డి పెద్దగా కేకలు వేయడంతో సమీప పొలాల్లో ఉన్న రైతులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే 108కి సమాచారం అందించడంతో ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంగిరెడ్డి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో గ్రామంతో విషాదచాయలు అలుముకున్నాయి. చనిపోయిన రైతు గంగిరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here