అన్ని దేశాల కంటే భారత్‌లో కరోనా మరణాల రేటు తక్కువ.. జాన్ హాప్కిన్స్ స్టడీ

ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో మరణాల రేటు తక్కువగానే ఉంది. వైరస్‌ను అదుపుచేసిన దక్షిణ కొరియా కంటే ఈ రేటు తక్కువ ఉండటం విశేషం. ప్రస్తుతం దేశంలో నిర్దారణ అయిన పాజిటివ్ కేసుల్లో మరణాల 3.3 శాతంగా ఉన్నాయి. ఇతర దేశాలతో పోల్చితే ప్రతి లక్ష మంది జనాభాకు కరోనా మరణాలు 0.09 శాతంగా ఉంది. వైరస్‌ను అదుపు చేయడంలో విజయం సాధించిన దక్షిణ కొరియాలో మొత్తం 10,793 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 250 మంది ప్రాణాలు కోల్పోయారు.

తమ దేశంలో వైరస్ వెలుగుచూసిన తొలినాళ్లలోనే మేల్కోన్న దక్షిణ కొరియా ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్ విధానంతో మహమ్మారిని నియంత్రించింది. పాజిటివ్ కేసులను బట్టి చూస్తే కరోనా మరణాలు 2.3 శాతం కాగా.. జనాభా ప్రతిపాదికన ఇది భారత్ కంటే ఎక్కువే. దేశంలో లక్షకు 0.09 శాతమైతే, దక్షిణ కొరియాలో ఇది 0.48 శాతం, చైనాలో 0.33 శాతం. భారత్‌లో కరోనా మరణాల రేటు అన్ని పెద్ద దేశాల కంటే తక్కువగానే ఉన్నట్టు అమెరికాలోని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ కరోనా వైరస్ రిసోర్స్ సెంటర్ అంచనా వేసింది.

చైనాలో మొత్తం 83,959 మందికి వైరస్ సోకితే వీరిలో 4,637 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే కరోనా మరణాలు రేటు 5.5 శాతం.. అదే భారత్‌లో 37,257 మంది వైరస్ బారినపడితే ఇప్పటి వరకూ 1,223 మంది చనిపోగా.. మరణాల రెటు 3.3 శాతంగా ఉంది. అయితే, అమెరికా, పలు ఐరోపా దేశాల్లో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. బెల్జియంలో ప్రతి లక్షకు 67.44 శాతంగా ఉంటే, అమెరికా 53, స్పెయిన్ 47, ఇటలీ 42, బ్రిటన్ 37, ఫ్రాన్స్ 20 శాతం.

ఈ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల నిష్పత్తి కూడా ఎక్కువగానే ఉంది. ఐరోపా దేశాల్లో 12 నుంచి 16 శాతం, అమెరికాలో ఇది 6 శాతంగా ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకూ అమెరికాలో 11.60 లక్షల మంది వైరస్ బారినపడగా.. మొత్తం 67,444 మంది మృత్యువాతపడ్డారు. స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లో కరోనా మరణాలు 25వేలు దాటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here