హైదరాబాద్ పాతబస్తీలో రెండు వర్గాల ఘర్షణ.. రాళ్లదాడి

హైదరాబాద్‌లోని పాతబస్తీలో రెండు వర్గాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక భవానీ నగర్‌‌లో కొంతమంది యువకులు రెండు గ్యాంగులుగా విడిపోయి కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. యువకులు పెద్దయెత్తున రాళ్లు రువ్వుకోవడంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read:

బైక్ పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘర్షణకు కారణంగా తెలుస్తోంది. ఇద్దరు యువకులు మధ్య మొదలైన ఈ గొడవ రెండు వర్గాల ఘర్షణకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు. గొడవకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశామని, మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here