హైదరాబాద్‌లో దారుణం.. వెంటాడి వేటాడి యువకుడి హత్య

లాక్ డౌన్‌తో ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరంలో మళ్లీ నేరాల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన హత్య కలకలం రేపుతోంది. ఓ యువకుడ్ని కత్తులో వెంటాడి వేటాడి కొందరు దారుణంగా హత్య చేశారు. ఈ దుర్ఘటన జగద్గిరి గుట్టలోని ఆర్పీ కాలనీలో చోటు చేసుకుంది. యువకుడిని కత్తులతో తరుముతూ హత్య చేసారు దుండగులు. స్థానికంగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. హత్యకు గురైంది రౌడీ షీటర్ ఫయాజ్ అని పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.

యువకుడి హత్య ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఫయాజ్ హత్యకు పాత కక్షలు కారణమా అన్న కోణంల పోలీసులు అని విచారణ చేస్తున్నారు పోలీసులు. అతన్ని పది మంది వెంటాడుతూ కత్తులతో నరికి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే కాలనీలోని యువకులే అతన్ని చంపారని ఫయాజ్ బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు స్థానికంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేసారు. సుమారు పది మంది ఫయాజ్‌పై దాడి చేసి ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here