సెక్స్ సైకోల పైశాచికం.. మహిళపై గ్యాంగ్ రేప్.. డ్రగ్స్ ఇచ్చి, సిగరెట్లతో కాల్చి..

లిఫ్ట్ ఇస్తానని కారెక్కించుకుని మహిళను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపై కేసు నమోదైంది. మహిళను కారు ఎక్కించుకుని మత్తుమందిచ్చి కిడ్నాప్ చేసిన దుండగులు.. తమ ఇంటికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె లేచిన వెంటనే మళ్లీ డ్రగ్స్ ఇచ్చి రేప్ చేశారు. ఫ్రెండ్ రేప్ చేస్తుంటే ఎంకరేజ్ చేస్తూ సెక్స్ సైకోలు పైశాచికంగా ప్రవర్తించాయి. మత్తులో ఉన్న ఆమెను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి ఇంటి చుట్టూ తిప్పుతూ వికృతానందం పొందారు. ఫ్లోరిడాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేయడంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశమైంది.

తనను కిడ్నాప్ చేసి మత్తుమందిచ్చి గ్యాంగ్ రేప్ చేశారని ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఎదుర్కొన్న దారుణ అనుభవాన్ని పోలీసులకు వివరించింది. ఆమె ఈ ఏడాది జనవరి 5న ఆరెంజ్ కౌంటీ నుంచి బంధువులను కలిసేందుకు మారియన్ కౌంటీకి బయల్దేరింది. ఆ సమయంలో ఆమెకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఓ వ్యాన్ వచ్చి ఆగింది. కారు డోర్ తీయగానే ఒంటినిండా టాటూలు వేయించుకుని ఓ వ్యక్తి భయంకరంగా ఉన్నాడు. అతని తల్లి కారు నడుపుతుండగా మరో స్నేహితుడు కారులో వెనక సీటులో కూర్చుని ఉన్నాడు. ఆ ముగ్గురిని చూసి మహిళ కారులో ఎక్కకూడదనే భావించింది.

Also Read:

అయితే అతని నడుము దగ్గర తుపాకీ లాంటి వస్తువు ఉండడంతో భయపడింది. టాటూలు వేయించుకున్న వ్యక్తి కారులో ఎక్కమని బెదిరించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కారు ఎక్కింది. మహిళ కారు ఎక్కిన వెంటనే ఆమెకు బలవంతంగా మత్తుమందిచ్చి కారు సీట్ల మధ్యలో పడేశారు. అనంతరం నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంటి ఆవరణలో కారుని ఆపి ఇంటి వెనక ఉన్న మరో పెద్ద వ్యాన్‌లోకి మార్చేశారు. ఇంటిలా మార్చేసిన ఆ వ్యానులో ఆమెను బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు డ్రగ్స్ ఇచ్చి ఆ మత్తులో గ్యాంగ్ రేప్ చేశారు.

Read Also:

టాటూలు వేయించుకున్న వ్యక్తి ఆమెను దారుణంగా రేప్ చేయడమే కాకుండా మరేదో వస్తువు కూడా లైంగిక దాడికి వినియోగించినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం అతని స్నేహితుడు కూడా ఆమెను రేప్ చేశాడు. ఫ్రెండ్ రేప్ చేస్తుంటే పక్కనే ఉండి గో.. గో అంటూ రెచ్చగొట్టాడని సెక్స్ సైకోల బాగోతాన్ని వివరించింది. ఓ రోజు మత్తులో నుంచి బయటికొచ్చి క్యాబ్‌కి ఫోన్ చేసిన విషయం తెలుసుకున్న బలవంతంగా ఆమె గొంతులో డ్రగ్స్ వేశాడు. ఆమె మత్తులోకి జారుకుంటుండగా సిగరెట్‌తో ఆమె జుట్టు కాల్చి.. జట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి ఇంటి చుట్టూ తిప్పుతూ రాక్షసానందం పొందాడు.

చివరికి మరో కారులో ఎక్కించి ఓ జనరల్ స్టోర్ దగ్గర పడేసి వెళ్లిపోయారని ఫిర్యాదు చేసింది. అప్పుడు కూడా సైకో తల్లి కారు నడిపినట్లు పేర్కొంది. మహిళ చేసిన అభియోగాలు నమోదు చేసిన పోలీసులు ఆ ముగ్గురిని ఇఫ్తిమియోస్ మైకేల్ జాకరి మికెడిస్, అతని తల్లి షన్నాన్ జేమ్స్, మూడో వ్యక్తిని రాబర్ట్ మెక్‌డానియెల్‌గా పోలీసులు గుర్తించారు. ఒంటినిండా టాటూలతో భయంకరంగా ఉన్న జాక్‌ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here